Over 200,000 H-1B workers in US could lose legal status by June

అమెరికాలో లీగల్ రైట్స్ కోల్పోనున్న 2 లక్షల H-1B ఉద్యోగులు.. ఇంటిదారి పట్టాల్సిందే? 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ వ్యాప్తితో అమెరికాలో రెండు లక్షల మంది తమ లీగల్ రైట్స్ కోల్పోనున్నారు. వచ్చే జూన్ నెలాఖరులో H-1B వర్కర్లంతా తమ చట్టపరమైన హోదాను కోల్పోనున్నట్టు ఇమ్మిగ్రేషన్ పాలసీ విశ్లేషకులు వెల్లడించారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోరుతూ గెస్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న 2,50వేల మంది జూన్ నాటికి తమ ఉపాధితో పాటు లీగల్ రైట్స్ కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు.. వేలాది మందికి పైగా నివాస హోదాను పొందని వారంతా బలవంతంగా అమెరికా నుంచి ఇంటి దారిపట్టనున్నారు. న్యూజెర్సీలోని పస్సియాక్ కౌంటీలో డెంటల్ ప్రాక్టీస్ చేస్తున్న వాసవాడ (31) కూడా తన చట్టపరమైన హోదాను కోల్పోనున్నారు. దేశంలో మరో మూడు వారాల్లో తన లీగల్ రైట్స్ కోల్పోనున్నట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

దాదాపు రెండేళ్లుగా అమెరికాలోనే డెంటల్ ప్రాక్టీస్ చేస్తున్న మాన్సీకి.. కొవిడ్-19 వ్యాప్తితో మార్చి మధ్యలోనే తలుపులు మూసుకున్నాయి. అప్పటినుంచి ఆమె జీతం లేని సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. అమెరికాలో మాన్సీ.. H-1B వీసాపై వెళ్లారు. నైపుణ్యం కలిగిన వారి కోసం రూపొందించిన తాత్కాలిక వీసా ప్రొగ్రామ్ ఇది. H-1B వీసాదారులకు చట్టపరంగా అమెరికాలో ఎలాంటి వేతనం లేకుండా 60 రోజులు మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆమె భర్త నందన్ బుచ్ కూడా డెంటిస్ట్. ఆయన H-1B వీసా కూడా జూన్ నాటికి ఎక్స్ పెయిర్ అవుతుంది. దాంతో ఈ డెంటిస్ట్ దంపతులిద్దరూ అమెరికా నుంచి ఎప్పుడు వెళ్లిపోవాల్సి వస్తుందోనన్న భయంతో రోజులు లెక్కబెడుతున్నారు. 

ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి.. అమెరికాలో ఉండలేరు.. తిరిగి సొంత దేశమైన భారత్‌కు వెళ్లనూ లేరు. ఎందుకుంటే ఇండియలో కూడా సరిహద్దులను మూసేవేసింది. అమెరికాలో తమ అడ్వాన్సడ్ డెంటిస్ట్ డిగ్రీల కోసం వీరిద్దరూ కలిసి అమెరికా యూనివర్శిటీల్లో 520,000 డాలర్ల వరకు స్టూడెంట్ లోన్ తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియాకు వెళ్లి అక్కడి తమ వేతనాలతో ఈ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం దాదాపు అసాధ్యమైన పనే.

ఇదే ఒత్తిడితో దంపతులిద్దరూ తీవ్ర ఆందోళనగా ఉన్నారు. మాన్సీ భర్త బచ్ తీవ్ర ఒత్తిడితో తన జుట్టు కూడా కోల్పోతున్నట్టు వాపోయారు. కనీసం కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చీకటి కమ్ముకుంటోందని ప్రతీది గందోరగోళంగా కనిపిస్తుందని మాన్సీ చెప్పారు. తమ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లి ఆగిపోతుందో తెలియడం లేదని వాపోయింది. 

అమెరికాలో గ్రీన్ కార్డు కోరే గెస్ట్ వర్కర్లలో దాదాపు 2,50,000లకు పైనే ఉన్నారు. వారిలో H-1B వీసా కలిగిన 2 లక్షల మంది తమ లీగల్ స్టేటస్ జూన్ ఆఖరు నాటికి కోల్పోనున్నట్టు ఇమ్మిగ్రేషన్ పాలసీ విశ్లేషకులు Jeremy Neufeld పేర్కొన్నారు. గత రెండు నెలల్లో పది లక్షల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ, వర్కింగ్ వీసాలతో వచ్చినవారి పత్రాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి. వీసా వర్కర్లంతా స్థానికంగా పుట్టిన వారు కాదు.. H-1B వీసా కలిగిన వారికి ఒక ప్రత్యేకమైన లొకేషన్, ఉద్యోగమిచ్చిన కంపెనీ కనీస వేతనంతో ముడిపడి ఉంటుంది. సెలవుపై విదేశాలకు వెళ్లిన వారి జీతాల్లో కోత విధిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో ఇంట్లో నుంచి వర్క్ చేసేందుకు అనుమతినిస్తే అది వీసా నిబంధనలను ఉల్లంఘించనట్టే అవుతుంది. H-1B వీసా ఉద్యోగులు 60 రోజుల పరిమితి ముగిసిన వెంటనే మరో ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పుడే మరో వీసా పొందడం లేదా దేశాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోకపోయినప్పటికీ డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ కొవిడ్-19 సంక్షోభం సమయంలో కలిగిన అంతరాయంతో వీసాల రెన్యువల్ పొందలేమనే ఆందోళన చెందుతున్నారు.