దుమ్మురేపుతున్న ‘డిస్కోరాజా’ సాంగ్

Submitted on 21 October 2019
Nuvvu Naatho Emannavo Lyrical - Disco Raja

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. సాయికృష్ణ సమర్పణలో, ఎస్ఆర్‌టి ఎంటర్‌‌టైన్‌మెంట్స్  బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ‘డిస్కోరాజా’ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు..

థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో.. బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో’ అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్.. ప్రేక్షకులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.. ‘నీలాల నీ కనుపాపలో ఏ మేఘ సందేశమో.. ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే.. చిరునామా లేని లేఖంటి నా గానం.. చేరిందా నిన్ను ఇన్నాళ్లకి.. నచ్చిందే లేదో ఓ చిన్న సందేహం.. తీర్చేశావేమో ఈ నాటికి.. మౌనరాగాలు పలికే సరాగాలతో.. మందహాసాలు చిలికే పరాగాలతో.. భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా.. స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా’.. అంటూ సాగే ఈ పాటకు సిరివెన్నెల, బాలు, థమన్ ముగ్గురూ మూడు మూలస్థంభాల్లా నిలిచారు.. 


Read Also : ‘అసురన్’ అద్భుతంగా ఉంది : మహేష్ ట్వీట్, ధనుష్ ఫ్యాన్స్ ఖుషీ


బాబీ సింహా, తాన్యా హోప్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.
  
 

Raviteja
Naba Natesh
Payal Rajput
Thaman S
sirivennela sitaramasastri
S P Balasubrahmanyam
SRT Movies
VI Anand

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు