కొత్త ట్రాఫిక్ రూల్ : బైక్ పై ఇద్దరికీ హెల్మెట్ మస్ట్

Submitted on 14 January 2020
new traffic rule, helmet must for both bike riders

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్‌ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ ఉంది. ఇక మీదట వెనుక కూర్చున్న వారు కూడా హెల్మట్ ధరించాల్సిందేనని సైబరాబాద్ పోలీసులు. చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగానే ప్రాణాలు పోతున్నాయి. బైక్ ప్రమాదాల్లో 70 శాతం అనర్థాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఒక్కోసారి హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడుతుంటే... వెనక కూర్చొని హెల్మెట్ పెట్టుకోని వ్యక్తి చనిపోతున్నారు. అందుకే.. బైక్ పై ఇద్దరు వెళ్తే... ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్లు ఉన్నాయి. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ రూల్ అమలవుతోంది. ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోనూ ఇవాళ్టి(జనవరి 14,2020) నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చింది. హెల్మెట్లు పెట్టుకోకపోతే... కేసులు రాసి ఫైన్లు వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చలానాలు ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ ఫైన్ చెల్లించాల్సింది బైక్ నడిపే వ్యక్తే. అంటే.. వెనక కూర్చున్న వ్యక్తి బాధ్యత కూడా బైక్ నడిపే వ్యక్తిదే అన్నమాట. రాచకొండ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 263 కేసులు రాశారు. రూ.28,400 జరిమానాలు వేశారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల ప్రజలంతా... రెండు హెల్మెట్లు కొనుక్కోవడం బెటర్. లేదంటే జేబుకి చిల్లు పడటం ఖాయం.

ఈ రూల్ పై వాహనదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మంచి రూల్ అని, ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని అంటున్నారు. అయితే.. ఇదెక్కడి గోల అని కొందరు వాహనదారులు విసుక్కుంటున్నారు. వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదని జరిమానా విధించడం కరెక్ట్ కాదంటున్నారు. 

జరిమానాలు విధించడమే ఉద్దేశ్యంగా ఈ రూల్ తీసుకురాలేదని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే తమ లక్ష్యం అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని నామ మాత్రపు జరిమానా(రూ.100) విధిస్తున్నామన్నారు. వాహనదారులు స్వీయ నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం అన్నారు. ప్రాణాలు విలువైనవని గ్రహించాలన్నారు. కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని పోలీసులు గుర్తు చేశారు.

Also Read : 2020లో ఈ 58 దేశాలకు వెళ్లేవారికి VISA అక్కర్లేదు!

Hyderabad
cyberabad
traffic police
Helmet
must
bikes
Both
riders
road accidents
Road Safety

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు