దేశంలోనే ఫస్ట్ టైమ్ : రూ.6వేల కోట్లతో ఏపీలో కొత్త పథకం

Submitted on 14 October 2019
new scheme in andhra pradesh

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్.. కొత్త కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అనేక అభివృద్ధి పనులు ప్రారంభించారు. వైఎస్ఆర్ వాహనమిత్ర, కంటి వెలుగు, రైతు భరోసా.. ఇలా అనేక స్కీమ్ లకు రూపకల్పన చేశారు. తాజాగా మరో కొత్త స్కీమ్ కి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్.. నాడు-నేడు స్కీమ్ కి శ్రీకారం చుట్టనున్నారు.

రానున్న నాలుగేళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలని, సదుపాయాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నాడు-నేడు కార్యక్రమం చేపడుతున్నారు. నవంబర్ 14 నుంచి దీన్ని స్టార్ట్ చేయనున్నారు. ప్రతి ఏడాది రూ. 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 

దీని ప్రకారం ఇప్పుడున్న స్కూల్ పరిస్థితిని ఫొటో తీస్తారు. ఆ తర్వాత రెండు నుంచి నాలుగేళ్లలోపు ఆ స్కూళ్లలో ఎలాంటి మార్పులు తెచ్చింది మరోసారి ఫొటోలు తీస్తారు. నాడు-నేడు పేరుతో ఈ ఫొటోలను ప్రజలకు చూపించి.. ప్రభుత్వం ఏ విధంగా స్కూల్స్ ను డెవలప్ చేసింది తెలియజేయాలనేది సీఎం జగన్ ఉద్దేశం. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పాఠశాల ఆధునీకరణ చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

కాగా ఈ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్ లకు కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని దేశంలోనే తొలిసారిగా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ పద్ధతి వైపు మొగ్గుచూపామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రానున్న నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ స్కూల్స్ ని ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

new scheme
AP
cm jagan
nadu nedu
Schools

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు