వేటు పడింది : నన్నయ్య వర్సిటీ ప్రొ. సూర్య రాఘవేంద్ర సస్పెన్షన్

Submitted on 14 October 2019
Nannaya university professor surya raghavendra suspension

తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ్య వర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సూర్య రాఘవేంద్ర రావుపై చర్యలు తీసుకున్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వర్సిటీ ఉమెన్ సెల్ ప్రాథమిక విచారణ జరిపింది. అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు వీసీ సురేశ్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. 

ఇటీవలే ఎంఏ ఇంగ్లీషు విద్యార్థినులను డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వేధింపులకు పాల్పడుతున్నడనే విషయం బయటకు పొక్కింది. బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. స్పెషల్ క్లాసులంటూ తన ప్లాటుకు పిలిపించుకుని వేధించేవాడని లేఖలో తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. దీనిపై వెంటనే సీఎం జగన్ స్పందించారు. విచారణ చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర డిపార్ట్ మెంట్‌లోనూ ఇలాంటి వేధింపులున్నాయనే ప్రచారం జరగుతోంది.

ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర ఇంగ్లీషు డిపార్ట్ మెంట్‌కు హెచ్‌వోడీగా ఉన్నాడు. విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, రూల్స్ ప్రకారం..ఉమెన్ సెల్‌కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. చివరకు ప్రొ.సూర్య రాఘవేంద్రను సస్పన్షన్‌కు గురయ్యారు. 
Read More : రైతుకు అండగా: వైఎస్ఆర్ భరోసా.. మూడు సార్లు.. తేదీలు ఇవే

Nannaya University
Professor
Surya Raghavendra
Suspension

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు