men-cant-crop-their-hair-due-lock-down-effect-all-saloons-closed

లాక్‌డౌన్‌తో మగవారికి హెయిర్ ‘క్రాఫ్‌’ కష్టాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వ్యాప్తితో నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అప్పటినుంచి హెయిర్ సెలూన్లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌కు ముందు హెయిర్ స్టయిల్ కోసం సెలూన్లకు పరుగులు పెట్టిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. వెళ్లినా హెయిర్ సెలూన్లు తెరిచే అవకాశం లేదు. ఒకవైపు తలపై జట్టు భారీగా పెరిగిపోతుంది. గడ్డాలు పెంచేస్తున్నారు. కొందరైతే ట్రిమ్మర్‌తో షేవింగ్ చేసుకుంటున్నారు. కానీ, తలపై హెయిర్ కటింగ్ చేయాలంటే తప్పనిసరిగా సెలూన్ కు వెళ్లాల్సిన పరిస్థితి. అసలే ఎండకాలం.. ఉక్కపోత ఎక్కువే.. పెరిగిన జుట్టు దురదతో మగవారంతా ఇబ్బందులు పెడుతున్నారు. 

హెయిర్ సెలూన్లకైనా సడలింపు ఇస్తే బాగుండూ అని ఆశగా ఎదురుచూస్తున్నారు. బయటకు వెళ్లి క్రాఫ్ చేయించుకోవాలంటే సెలూన్లు మూతపడ్డాయి. అలా అని ఎన్నిరోజులు ఇలా క్రాఫ్ ఉంచుకోవాలో తెలియక చికాకు పడుతున్నారు. కొందరైతే ఇంట్లోనే క్రాఫ్ చేయించుకుంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతోనే క్రాఫ్ చేయించుకుంటున్నారు. పెద్దలు, పిల్లలకు కూడా క్రాఫ్ చేస్తున్నారు. బయటకు వెళ్తే కరోనా భయం.. ఎందుకొచ్చిన సమస్య అనుకుంటున్నారు.. ఇంట్లోనే ఏదోలా హెయిర్ క్రాఫ్ చేసుకుంటూ లాక్ డౌన్ కాలాన్ని నెట్టుకుస్తున్నారు. మరికొందరైతే సెలూన్ షాపు వాళ్లను ఇళ్లకే రప్పించుకుని క్రాఫ్ చేయించుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం సెలూన్ షాపు యజమానులు లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 

ఎక్కువ సంఖ్యలో సెలూన్ లోపల కూర్చొబెట్టి బయట షాపులకు తాళం వేసి హెయిర్ కటింగ్ చేస్తున్నారు. వచ్చిన కస్టమర్లకు హెయిర్ క్రాఫ్ చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొంతమంది వాడిన కత్తెర, దువ్వెన్లను అందరికి వాడుతున్నారు. కొద్దినీళ్లతోనే హెయిర్ క్రాఫ్ చేసేస్తున్నారు. శానిటైజర్, చేతులకు గ్లౌజులు వేసుకోకుండానే క్రాఫ్ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో నిర్లక్ష్యంగా ఇలా పదుల సంఖ్యలో కస్టమర్లను ఒకే చోట కూర్చొబెట్టి క్రాఫ్ చేయడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. 

 

Related Posts