సఫారీకి వెళ్లిన టూరిస్టులను వెంబడించిన సింహం

Submitted on 14 October 2019
Lion Chases Tourists On Safari In Karnataka. Terrifying Video Is Viral

ఓ జూపార్క్ లో సింహం పర్యటకులకు చుక్కులు చూపించింది. జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన టూరిస్టుల వెంట పడింది ఓ సింహం. దీంతో కొన్ని సెకన్లు టూరిస్టులకు ప్రానం పోయినంత పనైయింది. కర్ణాకటలోని బళ్లారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఏడాది ఆగస్టులో కర్ణాటకలోని బళ్లారిలోని అటల్ బీహారీ పేయి జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన పర్యాటకులకు ఓ సింహం వెన్నులో వణుకు పుట్టించింది. సఫారీ జీపుని సింహం వెంబడించింది. జీపు స్పీడ్ గా ముందుకు వెళ్లేదాకా సింహం వెంబడిస్తూనే ఉంది. అయితే ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. సఫారీ వాహనంలో ఉన్న ఓ పర్యాటకు ఆ వీడియోను ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఒకటిన్నర నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

karnataka
lion
chase
Ballari
tourists
jeep safari
Speed
Vehicle
no injured

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు