పెరుగుతున్న కిడ్నీ సమస్యలు...అసలు కారణాలు ఇవే!

Submitted on 7 October 2019
Kidney Problem Symptoms And Causes

మన శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవం కిడ్నీ. శరీరంలోని రక్తాన్ని వడబోయడమే వీటిపని. దీని పనితీరు గనుక మందగిస్తే.. ఇక ఆ వ్యక్తి రకరకాల ఆరోగ్య సమస్యలకు గురైనట్టే. గత కొంతకాలంగా కిడ్నీల వ్యాధులు తీవ్రంగా మారాయి. మండుటెండల్లో పనిచేయడం, తగినంత నీరు తాగకపోవటం, ఒళ్లునొప్పులకు ట్యాబ్లెట్లు వాడటం చేస్తున్నారు. అయితే మూత్రపిండాలకు ముప్పు ఉన్నట్లేనని స్పష్టం చేశారు పరిశోధకులు. 

తెలుగు రాష్ట్రాల్లో గత ఎనిమిదేళ్ల నుంచి పోలిస్తే... ఈ ఏడాది కిడ్నీ జబ్బుల బాధితుల సంఖ్య దాదాపు ఆరింతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వీరిలో దాదాపు 60శాతం కిడ్నీలు ఫెయిలైన వారే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ విషయం పై పరిశోధించిన ముగ్గురిలో ఒకరు మన తెలుగు డాక్టరున్నారు. 

తెలంగాణకు చెందిన నిమ్స్ నెఫ్రాలజీ విభాగం ఆచార్యులు డాక్టర్ తాడూరి గంగాధర్, కర్ణాటకకు చెందిన డాక్టర్ వై.జె.అనుపమ, తమిళనాడుకు చెందిన డాక్టర్ సురేశ్ శంకర సుబ్బాలియన్ లు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గోవాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో 12 ఏళ్లుగా అధ్యయనం చేశారు. 

కిడ్నీలు ఫెయిల్ కావడానికి కారణం:
> బోరు నీటినే పంట పొలాలకు వాడుతున్నారు. 
> ఎండలో ఎక్కువగా పనిచేయడంతో... వారి శరీరంలో నీటి కొరత ఏర్పడుతోంది. 
> ఒంట్లో ద్రావణాలు తగ్గడం వల్ల రక్తపోటు పడిపోతుంది. దీంతో కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గుతోంది. 
> ఎండలో పనిచేస్తూ.. తగినంత నీళ్లు తాగకుండా ఉండటంతో దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యానికి గురికావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 
> తాగే నీరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా కిడ్నీలకు సమస్యలు ఏర్పడతాయని పరిశోధకులు స్పష్లం చేస్తున్నారు. 

kidney problems
On The Rise
Causes Of Kidney Failures

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు