జెర్సీ రీమేక్‌లో షాహిద్

Submitted on 14 October 2019
Jersey Movie Remake in Bollywood Shahid Kapoor is the Hero

మన టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్‌లో ఆదరణ పెరుగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాక, రూ.300 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన సినిమా 'జెర్సీ'.. ఈ సినిమా నాని కెరీర్‌లో మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది.

‘జెర్సీ’ హిందీలో రీమేక్ అవనుందని, నాని క్యారెక్టర్ కోసం షాహిద్ కపూర్‌ను కాంటాక్ట్ చెయ్యగా.. తనకు రూ.40 కోట్ల పారితోషికం కావాలని డిమాండ్ చేసాని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్‌గా ఆ వార్తల్లో క్లారిటీ వచ్చేసింది. అల్లు అరవింద్ - దిల్ రాజుతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ సంయుక్తంగా ‘జెర్సీ’ని బాలీవుడ్‌లో నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి రీమేక్‌ని కూడా డైరెక్ట్ చేయనున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌తో కబీర్ సింగ్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ జెర్సీలో హీరోగా కనిపించబోతున్నాడు.


Read Also : నాగశౌర్య స్పోర్ట్స్ బేస్డ్‌ మూవీ ప్రారంభం

ఇక తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జెర్సీ’ సినిమా డబ్బింగ్ రైట్స్ కొన్ని నెలల క్రితం దిల్ రాజు - అల్లు అరవింద్ కలిసి మంచి రేట్‌కి సొంతం చేసుకున్నారు. ఇక సినిమా పాయింట్ బాలీవుడ్ ఆడియెన్స్‌కి తప్పకుండా కనెక్ట్ అవుతుందని రీమేక్ చేయడానికి ఒక ప్లానింగ్‌తో రెడీ అయ్యారు. 2020 ఆగస్ట్ 28న సినిమాను రిలీజ్ చేసే విధంగా చిత్ర యూనిట్ షూటింగ్ షెడ్యూల్స్‌ ప్లాన్ చేసుకుంటోంది. మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ కావడం.. టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త ఊరటనిచ్చే విషయమే అని చెప్పుకోవాలి..

Jersey Hindi Remake
Shahid Kapoor
Allu Aravind
Dil Raju
Aman Gill
Gowtam Tinnanuri

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు