పటాస్ రవి-శ్రీముఖి.. బిగ్ బాస్‌లో అలా: ఇద్దరి మధ్య గొడవలున్నాయా?

Submitted on 20 October 2019
Interesting Conversation Between Ravi and Sreemukhi

ఒకప్పుడు రవి-లాస్య.. వారి మధ్య ఏదో ఉంది అంటూ గాసిప్పులు షికారు చేసేవి. వారిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనే స్థాయిలో రూమర్లు క్రియేట్ అయ్యాయి. అయితే తర్వాతి కాలంలో లాస్య సైడయ్యిపోయింది. శ్రీముఖి ఎంటర్ అయ్యింది. పటాస్ షో తో వీళ్లిద్దరి కాంబినేషన్‌కు క్రేజ్ వచ్చేసింది. అయితే సడెన్‌గా పటాస్‌కు బ్రేక్ ఇచ్చేసింది. శ్రీముఖి అంతే.. ఇదే టైమ్‌లో శ్రీముఖి, రవి జంట విడిపోయారు అంటూ వార్తలు వచ్చేశాయి. అనంతరం చాలాకాలం పాటు తనకు పెళ్లైన విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తపడిన యాంకర్ రవి, ఇప్పుడు తన భార్యతో షోలకు కూడా హాజరవుతూ ఉన్నారు.

ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా మరోసారి రవి-శ్రీముఖిల గురించి టాలీవుడ్‌లో టాక్ మొదలైంది. బిగ్ బాస్ షోకి అలీ ఫ్రెండుగా ఎంట్రీ ఇచ్చిన రవి, స్టేజీ మీద హల్ చల్ చేశాడు. తమదైన స్టయిల్‌లో ఫ్రెండ్లీగా అందరినీ కలుపుకుని పోతూ ఎంటర్‌టైన్ చేశాడు. అలీ తన గిఫ్ట్ తెచ్చుకునేలోపు రవి శ్రీముఖిని చూసి తప్పదు అన్నట్లుగా పలకరించాడు. ఆమె కూడా అంతే ముభావంగా స్పందించింది. కంటెస్టెంట్లకు సంబంధించి వచ్చిన అందరు కుటుంబ సభ్యులతో బాగా ఉన్న శ్రీముఖి చాలా ఉత్సాహంగా పలకరించింది.

అయితే తనతో పాటు ఎన్నో ఏళ్లుగా హోస్ట్ చేసిన శ్రీముఖిని మాత్రం అస్సలు పట్టించుకోలేదు శ్రీముఖి. రవి పలకరిస్తే కూడా తప్పదూ అన్నట్లుగా మాట్లాడింది. వీరిద్దరు మాట్లాడుకున్న తీరు ఆసక్తికరంగా కనిపించింది, అనిపించింది. ఒకరికొకరు పలకరించుకున్న తీరు అనేక అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తుంది. శ్రీముఖి కాస్త పరిచయం ఉంటేనే మాములుగా హడావుడి చేయదు. అటువంటిది రవితో అలా మాట్లాడడంతో వీరిద్దరి మధ్య ఏమి జరిగింది అనేదానిపై ఇంట్రస్టు క్రియేట్ అయ్యింది. రవి-శ్రీముఖి నడుమ నిజంగానే సంబంధాలు దెబ్బతిన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Interesting Conversation
ravi
Sreemukhi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు