indias-internet-consumption-during-covid-19-lockdown-shows-data

కరోనా లాక్‌డౌన్‌లో భారతీయులు 308,000 TB ఇంటర్నెట్ డేటా వాడేసారు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్‌డౌన్‌తో భారత ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితం కావడంతో అంతా ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ లో దాదాపు 308,000 టెరా బైట్స్ (TB) డేటాను వినియోగించినట్టు ఓ డేటా వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోడీ ‘జనతా ఖర్ఫ్యూ’ (మార్చి 22) ప్రకటించినప్పటి నుంచి పూర్తిగా షట్ డౌన్ (మార్చి 25) అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఇంటర్నెట్ డేటాను భారీగా వినియోగించినట్టు టెలికమ్యూనికేషన్స్ శాఖ డేటాను వెల్లడించింది. ఈ డేటా మార్చి 22 నుంచి మార్చి 28 మధ్యలో భారతీయ ఇంటర్నెట్ యూజర్లు సగటున 307,963 TB లేదా 307 పెటాబైట్స్ (PB) డేటా వినియోగించినట్టు వెల్లడించింది.  

 

మార్చి 21న వినియోగించిన 282,282 TB లేదా 282 PB డేటా నుండి 9శాతం పెరిగగా.. ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన రోజు, మార్చి 19 నుండి 13శాతం పెరగడంతో డేటా వినియోగం 270 PB వరకు నమోదైనట్టు DoT తెలిపింది. మార్చి 22, మార్చి 27..  ఈ రెండు రోజుల్లోనే అత్యధికంగా ఇంటర్నెట్ సగటున 312PB డేటా వాడినట్టుగా DoT గణాంకాలు వెల్లడించాయి. మార్చి 26న కూడా ఇంటర్నట్ వినియోగం 311 PB డేటాగా నమోదైంది. ఇంటర్నెట్ వినియోగంలో ఒక PB (పెటా బైట్స్) ఒక 1,000 TB లేదా 1 మిలియన్ GB (గిగాబైట్)కు సమానం. 

ఇతర రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్టు గణాంకాలు తెలిపాయి. మార్చి 22, మార్చి 28 మధ్య కాలంలో 12 శాతం మేర డేటాను వాడగా.. లాక్ డౌన్ కు ముందు రోజుల్లో డేటా వినియోగం 19.6 PB నుంచి 22 PB కి చేరింది. బీహార్‌లో కూడా ఇదే కాలంలో 12శాతం 20 PB నుండి 22.6 PBకి పెరిగింది. మహారాష్ట్ర గరిష్టంగా లాక్ డౌన్ సమయంలో (26.6 PB) వినియోగాన్ని కొనసాగించింది. దాని వినియోగం మార్చి 22, మార్చి 28 మధ్య 24 PB నుండి 7శాతం పెరిగింది. వినియోగం ఇప్పుడు స్టేబిలైజ్ అయింది.

 

ఏప్రిల్ 5, ఏప్రిల్ 11 మధ్య వారంలో సగటున 300PB, ఏప్రిల్ 14న 298 PB గణాంకాలు చూపించాయి. స్ట్రీమింగ్ సైట్స్ స్ట్రీమింగ్ రిజల్యూషన్‌ను 50శాతం కంటే ఎక్కువ తగ్గించాలని నిర్ణయించడంతో వినియోగం పరిమితుల్లోనే ఉండిపోయింది. HDకు బదులుగా SD (స్టాండర్డ్ డెఫినిషన్‌)లో వీడియోలను స్ట్రీమింగ్ ఇస్తోంది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, వూట్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓవర్-ది-టాప్ (OTT) ప్రొవైడర్లకు మార్చి 23న స్ట్రీమింగ్ రిజల్యూషన్‌ను తగ్గించాలని లేఖ రాసింది. 

భారతీయ డిజిటల్ ఇండస్ట్రీ మార్చి 25న ఒక ప్రకటనను విడుదల చేసింది. కంపెనీలు తాత్కాలికంగా HD, అల్ట్రా-HD స్ట్రీమింగ్‌ను SDకి డిఫాల్ట్ చేయడం లేదా సెల్యులార్ నెట్‌వర్క్‌లలో 480p కంటే ఎక్కువ లేని బిట్ రేట్ల వద్ద SD కంటెంట్‌ను మాత్రమే అందించడం వంటి కొన్ని చర్యలను ఏకగ్రీవంగా అంగీకరించాయని తెలిపింది. ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్ చాలా ముందుగానే ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై లోడ్ నిర్వహించడానికి తగ్గిన బిట్ రేట్లను ప్రకటించాయి.

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ వినియోగ రేట్లు క్రమంగా పెరిగాయి. నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ (MBIT) నివేదిక 2019లో మొత్తం డేటా ట్రాఫిక్‌లో 47శాతం పెరిగింది (అంతకుముందు సంవత్సరంతో పోల్చితే). ఇది వినియోగదారుకు నెలకు 11 GBగా అనువదిస్తుంది. 4G వినియోగం ద్వారా నడుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరును విశ్లేషించే Site Speed Test, ఏప్రిల్ 15 నివేదికలో కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా వేగంపై ప్రభావం చూపిస్తూ.. ఫిక్సడ్ లైన్ స్పీడ్  6శాతం క్షీణించగా.. మొబైల్ స్పీడ్ 18శాతం క్షీణించిందని చెప్పారు. మార్చి 2వ వారంలో నివేదిక ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశం ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ సగటున 36.17 mbps ఉండగా, మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 9.67Mbpsగా నమోదైంది.  

ఈ నివేదిక ప్రకారం.. మొబైల్, ఫిక్సడ్ బ్రాడ్‌బ్యాండ్ పర్ఫార్మెన్స్ పరంగా పరిశీలిస్తే.. చైనా, ఆస్ట్రియా, జపాన్, ఇజ్రాయెల్,  UAE వంటి దేశాల కంటే భారతదేశం వెనుకబడి ఉంది. అయినప్పటికీ ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల కంటే భారతదేశం ముందు ఉంది.