Google Meet video calling now integrated inside Gmail to take on Zoom

Zoomకు పోటీగా ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్లు.. 50మంది వరకు ఉచితంగా గ్రూపు వీడియో కాలింగ్ చేసుకోవచ్చు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ యూజర్ల కోసం కొత్త వీడియో కాలింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో మెసేంజర్ రూమ్స్ సహా ఇతర వీడియో కాలింగ్ ఫీచర్లను అందిస్తోంది. ఈ వీడియో కాలింగ్ ఫీచర్ల ద్వారా 50 మంది వరకు ఉచితంగా గ్రూపు వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత నెల రోజులుగా వీడియో కాలింగ్ ప్రొడక్టుల్లో Zoom, Houseparty ప్లాట్ ఫాంలను యూజర్లు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ రెండింటిలో వాడే మెసేంజర్ రూమ్స్ ద్వారా ప్రైవసీ ముప్పు ఉందంటూ సైబర్ సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ కొత్త వీడియో ఫీచర్లను యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్ బుక్ యాప్స్ ద్వారా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సంఖ్యలో యూజర్లు కనెక్ట్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పించింది. మరోవైపు Zoom షేర్లు రోజు 3 శాతం పెరగగా.. ఇప్పుడు ప్రైవసీ ముప్పు వార్తలతో 5 శాతానికి క్షీణించాయి. 

మెసేంజర్ రూమ్స్.. ఫేస్‌బుక్ కొత్త వీడియో కాలింగ్ సర్వీసుల ఫ్లాగ్ షిప్‌కు చెందినవి. ఇందులోని ఫ్రీ ఫీచర్ ద్వారా ఫేస్ బుక్, మెసేంజర్ యూజర్లను గ్రూపు వీడియో కాలింగ్స్ 50 మంది వరకు క్రియేట్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. కానీ, మెసేంజర్ వీడియో కాల్స్ మాత్రం 8 మందికి మాత్రమే పరిమితి ఉంది. మెసేంజర్ రూమ్స్ లో 50 మంది పరిమితి వీడియో కాలింగ్ ఆప్షన్ తక్షణమే అందుబాటులోకి రాదు.

ఫేస్ బుక్ యూజర్లు ఈ ఫీచర్ లాంచ్ సమయంలో చిన్నపాటి పరిమితి ఉంటుంది. కానీ, అది నెమ్మదిగా 50 మంది పరిమితికి చేరుకుంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. లాంచ్ సమయంలో వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితి మారుతుందని ఆయన వెల్లడించారు. ఫేస్ బుక్ వీడియో కాలింగ్ ఫీచర్లను జూమ్ వీడియో కాలింగ్ ఫీచర్‌తో పోలిస్తే.. Zoom తమ యూజర్లను వీడియో చాట్ చేసేందుకు 100 మంది వరకు అనుమతినిస్తుంది. ఇందులో 40 నిమిషాల వరకు ఉచితంగా అందిస్తోంది. ఇక Houseparty యాప్ కూడా తమ యూజర్లకు 8 మంది వరకు సపోర్ట్ చేస్తుంది. 

మెసేంజర్ రూమ్స్ లో వీడియో కాల్స్ చేస్తే ఎలాంటి పరిమితి ఉండదు. ఇందులోని రియాల్టీ ఫిల్టర్లు ద్వారా గ్రూపు వీడియో కాలింగ్‌లో పాల్గొనే సభ్యుల ముఖాలకు సిల్లీ మాస్క్‌లు యాడ్ అవుతాయి. మెసేంజర్ రూమ్ హోస్ట్ చేసే యూజర్లకు కాల్స్, యూజర్లను తొలగించే అధికారం ఉంటుంది. ఫేస్ బుక్, మెసేంజర్ యూజర్లు మెసేంజర్ రూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా తమ వీడియో చాట్ లోకి జాయిన్ అయ్యేలా అనుమతించవచ్చు. ఫేస్ బుక్ అకౌంట్ లేని యూజర్లకు కూడా ఇందులో జాయిన్ కావొచ్చు. మెసేంజర్ రూమ్స్ యూజర్లకు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

రానున్న వారాల్లో మరిన్ని ప్రాంతాలకు మెసేంజర్ రూమ్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఫేస్ బుక్ తమ సొంత యాప్ వాట్సాప్ వీడియో కాలింగ్ ను కూడా డబుల్ చేసింది. వీడియో కాల్ చేసే సభ్యుల పరిమితిని నాలుగు నుంచి 8 మందికి పెంచింది. అదనంగా ఫేస్ బుక్ డేటింగ్ కోసం వీడియో కాలింగ్ ఫీచర్ కూడా రిలీజ్ చేసింది. ఈ సర్వీసు ద్వారా యూజర్లు వర్చువల్ డేట్స్ వెళ్లొచ్చు. ప్రతిరోజు వీడియో కాల్స్ వాట్సాప్, మెసేంజర్ మధ్య 700 మిలియన్లకు పైగా అకౌంట్లు పాల్గొంటున్నాయని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మెసేంజర్ Stan Chudnovsky తెలిపారు. 

Related Posts