మాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు: వైరల్‌గా మారిన బీజేపీ ఎమ్మెల్యే కామెంట్లు

Submitted on 13 October 2019
‘Don’t need Muslims’ vote, says BJP MLA in viral video; explain, says party

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో వివాదస్పద కామెంట్లు చేశాడు. ముస్లిం ఓట్లు అవసరం లేదని చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. ఉత్తరాఖాండ్‌లోని రుద్రాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ తానెప్పుడూ ఏ ముస్లింని, మసీదుని ఓట్ల కోసం అడ్డుక్కోలేదని చెప్పుకొచ్చాడు. 

'నాకు ఏ ముస్లిం ఓటు అవసరం లేదు. నా జీవితం తెరచిన పుస్తకం. వాళ్ల గుమ్మాల దగ్గరకి, పండుగలకి వాళ్లను కలవడానికి వెళ్లలేదు. నా తల మీ ముందే వంచుతా. మీ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. నేను ఏ ముస్లిం కోసం ఏ పని చేయను. మేము బతికున్నంత వరకూ భారత్‌ను విడదీయలేరు' అని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశాడు. 

దీంతో బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు దేవేంద్ర భాసిన్ అసహనం వ్యక్తం చేశాడు. పార్టీ జనరల్ సెక్రటరీ అనిల్ గోయల్ ఎమ్మెల్యే తుక్రాల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసినట్లు తెలిపాడు. బీజేపీ కులం, రంగు, నమ్మకాలను బట్టి వేరుగా చూడదు. అందరి సహకారంతో అభివృద్ధి సాధించాలనే కోరుకుంటున్నామని వెల్లడించారు. 

వీడియో గురించి తుక్రాల్ ఎమ్మెల్యేను అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఇది 2011 అక్టోబరు 2నాటిదని ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని చెప్పుకొచ్చాడు. 'నేను రెండో సారి ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు మా పార్టీ అందరి సహకారంతో అందరి అభివృద్ధి అని చెప్తోంది. నేను అదే నమ్ముతున్నాను' అని వివరించాడు. 

Muslims vote
bjp mla
BJP
Viral Video

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు