covid-19-man-treated-plasma-therapy-recovers-first-india

ఇండియాలో ప్లాస్మా థెరఫీ సక్సెస్.. ఢిల్లీలో తొలి పేషెంట్ రికవరీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండియాలో COVID-19కు చేసిన ప్లాస్మా ట్రీట్‌మెంట్ సక్సెస్ అయింది. ఢిల్లీలో తొలి పేషెంట్ ఇదే పద్ధతిలో చికిత్స అందుకుని కరోనాను జయించాడు. ఏప్రిల్ 4వ తేదీన చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. సాకేత్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలు ఉండటంతో అతనికి ఏడు రోజుల క్రితమే వెంటిలేటర్ తో చికిత్స అందిస్తూ వస్తున్నారు. 

అతను జాయిన్ అయినప్పుడు లక్షణాలు తక్కువగానే కనిపించాయి. కొద్ది రోజుల్లోనే వ్యాధి ముదిరినట్టుగా కనిపించింది. కాబట్టే అతనికి వెంటిలేటర్ సపోర్ట్‌తో ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాం. ఆ తర్వాత న్యూమోనియా పెరిగి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతింది. COVID-19నుంచి కోలుకుంటున్నట్లు కనిపించకపోవడంతో అతని కుటుంబం ప్లాస్మా డొనేట్ చేసేందుకు ఓ డొనార్ ను ఏర్పాటు చేశారు. 

డొనేట్ చేసే ముందు హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ, హెచ్ఐవీ అన్నీ పూర్తి అయిన తర్వాత ఆమె నుంచి ప్లాస్మా సేకరించారు. ‘మాకు ఈ కేసులో ఛాలెంజింగ్ సమయంలో కొత్తగా ట్రీట్‌మెంట్ చేసే అవకాశం దక్కింది. దాంతో పాటే మాకు ఈ విషయం కూడా జ్ఞాపకం ఉంది. ప్లాస్మా థెరఫీ అనేది మ్యాజిక్ బులెట్ కాదు. కానీ, ప్లాస్మా థెరఫీతోనే వంద శాతం కోలుకుంటారని కూడా చెప్పలేం. రోగి కోలుకోవడంలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి’ అని మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజా అన్నారు. 

ఒక్కో డొనార్ 400మిల్లీలీటర్ల వరకూ ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. అది ఒకొక్కరికి 200మిల్లీలీటర్ల చొప్పున ఇద్దరి ప్రాణాలు కాపాడుతుంది.