పెంపుడు జంతువుల నుంచి కరోనా సోకదు.. ఆందోళన పడొద్దు : వెటర్నరీ సైంటిస్టులు

Submitted on 9 April 2020
Coronavirus will not spread from Pets to owners, Veterinary scientists

జంతువులలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి యజమానులు తమ పెంపుడు జంతువులను ఇంట్లోనే ఉంచాలని పశువైద్య శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. కానీ పెంపుడు జంతువుల నుండి వ్యాప్తి ప్రమాదం గురించి యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రిటిష్ వెటర్నరీ అసోసియేషన్ గట్టిగా నొక్కిచెప్పింది.

‘కోవిడ్ -19 తో పెంపుడు కుక్క లేదా పిల్లి నుంచి మనుషులకు సోకినట్టు ఒక్క కేసు కూడా లేదు’అని హాంకాంగ్‌లోని City Universityకి చెందిన డాక్టర్ Angel Almendros అన్నారు. ఇతర పిల్లుల నుంచి పెంపుడు పిల్లులకు కరోనా వైరస్‌ను సోకే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. డాక్టర్ Angel Almendros చెప్పిన ప్రకారం.. పెంపుడు పిల్లులను ఇంటి లోపల ఉంచడం ఎంతో ఉత్తమమని, అదే సురక్షితమైన ప్రదేశంగా పేర్కొన్నారు.

మనుషుల నుంచి జంతువులకు వ్యాప్తి :
Almendros ఇచ్చిన సలహాతో తాను అంగీకరించానని British Veterinary Association (BVA) అధ్యక్షుడు Daniella Dos Santos చెప్పారు. కరోనా వ్యాప్తిపై అపోహాల గురించి పెంపుడు జంతువుల యజమానులకు సిఫారసు చేయడాన్ని అసోసియేషన్ స్పష్టం చేసింది. పిల్లులను ఇంటి లోపల ఉంచే ముందు జాగ్రత్తలు
తీసుకోవాలని అన్నారు.
cats

వారి సొంత ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమేనని చెప్పారు. ప్రతి పెంపుడు యజమాని చేతులను ఎప్పడికప్పుడూ శుభ్రంగా కడుక్కోవాలని, ఇంట్లో పరిశుభ్రత పాటించాలని ఆమె తెలిపారు. ఒక పెంపుడు జంతువు అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే ఆ జంతువుపై ఉన్న జుట్టుపై కొంతకాలం వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. 

ఈ విషయంపై ఇటీవలే.. డాక్టర్ Angel Almendros హాంకాంగ్‌లోని 17 ఏళ్ల పెంపుడు కుక్కకు కరోనా వైరస్‌కు సోకిందని చెప్పాడు. అది యజమాని నుంచే సోకినట్టుగా స్పష్టంగా పేర్కొంది. కానీ, మనకు ఈ పాజిటివ్ ఫలితాలు ఉన్న చోట కూడా జంతువులు అనారోగ్యానికి గురికావడం లేదని ఆయన అన్నారు. "హాంగ్ కాంగ్‌లో మునుపటి Sars-Cov వ్యాప్తి లాగా 2003లో అనేక పెంపుడు జంతువులకు సోకినప్పటికీ అనారోగ్యానికి గురికావు. కుక్కలు లేదా పిల్లులు అనారోగ్యానికి గురికావచ్చని లేదా ప్రజలకు సోకుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

మనుషుల నుంచి జంతువులకు ఎలా వ్యాపిస్తుంది? :
పిల్లులు శ్వాసకోశ బిందువుల నుంచి వైరస్ సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. గాలిలోని వైరస్ కణాలు ఎవరైనా దగ్గు, తుమ్ము లేదా ఊపిరి పీల్చుకోవడం ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంది. బెల్జియంలో ఒక పిల్లి యజమానిలో కరోనా లక్షణాలు కనిపించిన వారం తరువాత దానిలో పాజిటివ్ తేలింది. అంటే.. మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ సోకుతుందని గుర్తించారు. చైనాలోని శాస్త్రవేత్తలు ల్యాబరేటరీలో టెస్టులు నిర్వహించారు. వైరస్ సోకిన పిల్లులు.. ఇతర పిల్లులకు వ్యాప్తి చేసినట్లు ఆధారాలను వెల్లడించాయి.
tiger
 
ఇటీవలే న్యూయార్క్‌లోని Bronx Zooలో పులి సంక్రమణతో పాటు, పిల్లులు వ్యాధి బారిన పడతాయని ప్రయోగాత్మక ఆధారాలతో గుర్తించడం ఆసక్తికరంగా మారిందని UK's Pirbright Institute డైరెక్టర్ ప్రొఫెసర్ Bryan Charleston అధ్యయనంలో అంటు వ్యాధి మానవుల నుండి ఇతర జంతువులకు సోకిన ఆధారాలు ఉన్నాయని అన్నారు. మానవులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అడవి కోతులకి వ్యాప్తి చేయగలరని ఆధారాలు ఉన్నాయి.

కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తిని గొరిల్లాతో సహా క్రూర జంతువులను రక్షించడానికి పనిచేసే సంరక్షణకారులను ఆందోళన కలిగిస్తుంది. మనుషుల నుంచి పెంపుడు జంతువులకు సోకిన ఈ వ్యాధిని తిరిగి మానువులకు సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పెంపుడు జంతువులను మీ ఇంటిలోని ఇతర వ్యక్తులలా చూసుకోండి. మీకు అనారోగ్యం అనిపిస్తే.. వారితో సంభాషించకపోవడమే మంచిది" అని డాక్టర్ అల్మెండ్రోస్ అన్నారు.

Also Read | హైదరాబాద్ లో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న ప్రాంతాలు 12.. అక్కడ రాకపోకలు బంద్, ఇంటింటి సర్వే

Veterinary scientists
coronavirus
Pets
OWNERS
British Veterinary Association

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు