coronavirus-boom-guntur-district-104-cases-narasarao-peta

గుంటూరు జిల్లాలో కరోనా కలవరం.. నరసరావు పేటలో 104 కేసులు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అసలు ఆ నగరానికి ఏమైంది. లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలుతున్నా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదా? కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అన్న అనుమానాలు కల్గుతున్నాయి. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను ట్రేస్ చేయడంలో అధికారులు విఫలమయ్యారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. 
   
అసలు అక్కడ జరిగిన లోపం ఏంటీ… మిగతా జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నా…గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఇవాళ కొత్తగా 26 కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ నరసరావుపేటపై ఫోకస్ పెట్టారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

నరసరావు పేటలో కరోనా కేసులు సంచరీ క్రాస్ చేసింది. ఇవాళ కూడా 26 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో మొత్తం 104 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరగడంపై నరసరావుపేట ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కరోనా కట్టడికి నరసరావు పేట డివిజన్ మొత్తాన్ని అధికారులు ఇవాళ, రేపు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో రోడ్లన్ని నిర్మానుశ్యంగా మారాయి. 
రెడ్ జోన్లపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటిప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నరసరావుపేటలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇక వరవకట్ట ప్రాంతంలో వైరస్ స్వైర విహారం చేస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం పేటపై ఫోకస్ పెట్టి ఇంటింటిని జల్లెడ పడుతున్నారు. అనుమానితులను క్వారంటైన్ కు తరలించి, పరీక్షలు చేస్తున్నారు. రోజుకు 300ల మందికు పైగా కరోనా టెస్టులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 2 వేల 700 మంది జనాభాతో 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక అంతే వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. 

పెద్దచెరుువు, రామిరెడ్డిపేట, పాతూరు, నిమ్మతోట, అల్లూరివారి పాలెం, కొండగుట్ల తదితర ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. వరవకట్ట వాసుల ద్వారా రామిరెడ్డిపేట, కోటప్పకొండ రోడ్డు, ఇస్లాంపేట తదితర ప్రాంతాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. పక్కనే బరంపేట, ప్రకాశ్ నగర్, నవోదయ నగర్ వాసులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. వైద్య ఆరోగ్యం, పోలీసు, రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు వైరస్ మూలాలను గుర్తించే పనిలో పడ్డారు. ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. 
ఏపీలో గత 24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయని నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గానూ 287 మందికి నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్  చేశారు. మొత్తం 1014 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 28, 2020) ఉదయం 9 గంటల నుంచి బుధవారం (ఏప్రిల్ 29, 2020) వరకు రాష్ట్రంలో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదని ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 31 గా ఉంది.  

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరోనా ఆస్పత్రుల్లో పని చేయుటకు కొత్తగా 1170 మంది డాక్టర్లను నియమించటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 53 కేసులు నమోదయ్యాయి. కాగా..వైరస్ ఫ్రీ జిల్లాగా విజయనగరం జిల్లా కొనసాగుతోంది. 

Related Posts