ఏపీ @ 1259, కొత్తగా 82 కరోనా కేసులు నమోదు, ఆ 3 జిల్లాలోనే 800మంది బాధితులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1259కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 31మంది చనిపోయారు. 258 కరోనా నుంచి కోలుకున్నారు. 970మంది కరోనా నుంచి కోలుకున్నారు. మంగళవారం(ఏప్రిల్ 28, 2020) ఉదయం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా కేసులపై తాజా బులెటిన్ విడుదల చేసింది. 

ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 13, కడప జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో కర్నూలు జిల్లా 332 కేసులతో టాప్ లో ఉంది. ఆ తర్వాత 254 పాజిటివ్ కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. 223 పాజిటివ్ కేసులతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో ఉంది. కాగా, ఏపీలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే కరోనా ఫ్రీగా ఉంది. ఇప్పటివరకు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు:

కర్నూలు జిల్లా – 332
గుంటూరు జిల్లా – 254
కృష్ణా జిల్లా – 223
నెల్లూరు జిల్లా – 82
చిత్తూరు జిల్లా – 74
కడప జిల్లా – 65
ప్రకాశం జిల్లా – 56
పశ్చిమ గోదావరి జిల్లా – 54
అనంతపురం జిల్లా – 54
తూర్పుగోదావరి జిల్లా – 39
విశాఖపట్నం జిల్లా -22
శ్రీకాకుళం జిల్లా – 4
విజయనగరం జిల్లా – 4

మొత్తం కేసులు – 1259
మొత్తం మరణాలు – 31
యాక్టివ్ కేసులు – 970
కోలుకున్న వారు – 258

Related Posts