జనవరి 31న ‘చూసీ చూడంగానే’

Submitted on 14 January 2020
Choosi Choodangaane Releasing on 31st Jan 2020

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’ వంటి విభిన్న చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కందుకూరి.. ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ.. ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘చూసీ చూడంగానే’ అనే సినిమా నిర్మిస్తున్నారు. రాజ్ కందుకూరి గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ అసోషియేషన్లో రిలీజవనుంది.

తమిళనాట ‘96’ ‘బిగిల్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. మాళవిక సతీషన్ కీలక పాత్రలో కినిపించనుంది. క్రిష్ జాగర్లమూడి, సుకుమార్ వంటి దర్శకుల దగ్గర పనిచేసిన శేష సింధు దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా విడుదల తేది ప్రకటించారు. జనవరి 31న ‘చూసీ చూడంగానే’ థియేటర్లలోకి రాబోతోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ‘మెంట‌ల్ మ‌దిలో’ కెమెరామెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

విడుదల -సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: వేద రామ‌న్‌
డైలాగ్స్‌: ప‌ద్మావ‌తి విశ్వేశ్వ‌ర్‌
ఎడిట‌ర్: ర‌వితేజ గిరిజాల‌.
 Image

Shiva Kandukuri
Varsha Bollamma
Gopi Sundar
Raj Kandukuri
Sesha Sindhu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు