అల వైకుంఠపురములో.. అమెజాన్‌లో చూడలేరు!

Submitted on 14 October 2019
bluesky cinemas says you wont see ala vikuntapuramlo.. amazon and netflix

ఈ మధ్య కాలంలో సినిమాలను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై చూడటానికి జనాలు అలవాటు పడిపోయారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటానికి బదులు ఓ నెల రోజులు ఆగితే.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు కదా అనేది ప్రేక్షకుల ఆలోచన. మరి కొన్ని సినిమాలు అయితే థియేటర్లలో ఉండగానే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను హెచ్‌డీ క్వాలిటీతో అందుబాటులోకి తేవడంతో నెటిజన్లు కూడా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఆయా సంస్థలు కూడా యూజర్లను ఆకర్షించేలా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉండే చాలా మంది సినిమాలు చూసేందుకు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓవర్సీస్‌లో సినిమాల కలెక్షన్లు పడిపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బ్లూస్కై సినిమాస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుకుతున్న ‘అల... వైకుంఠపురములో..’ చిత్రం ఓవర్సీస్‌ హక్కులు భారీ ధరకు దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్‌.. ‘అల... వైకుంఠపురములో..’ సినిమాను ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరని తెలుపుతూ.. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

Read Also : షీర్ ఖూర్మా - ఫస్ట్ లుక్

అయితే ఈ చిత్రం థియేటర్లలో ఉన్నంతకాలం.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఓవర్సీస్‌లో కలెక్షన్లు రాబట్టుకోవచ్చనేది ఆ సంస్థ ఉద్దేశంగా తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్.. టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న 'అల..వైకుంఠపురములో'.. రిలీజ్ కానుంది. 

 

bluesky cinemas
Allu Arjun
Pooja Hegde
Thaman S
Trivikram

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు