మోడీపై సుప్రీంకోర్టు జడ్జ్ ప్రశంసలు.. తప్పు బట్టిన బార్ అసోసియేషన్

Submitted on 26 February 2020
Bar Association "Deeply Concerned" Over Supreme Court Judge's "Effusive Praise" For PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసలు కురిపించడాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది. అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తి వైఖరి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నీరుగారుస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ).

అత్యున్నత న్యాయస్థానం జడ్జిలుగా రాజ్యాంగ మౌలిక సూత్రాల మేరకు నడచుకుంటారని, పక్షపాత రహితంగా ఉంటారని ప్రజలు భావిస్తారని, కానీ జడ్జ్ మిశ్రా మోడీని పొగడడం సరికాదని బార్  అసోసియేషన్ ప్రెసిడెంట్ లలిత్ బాసిన్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థకు న్యాయమూర్తులు దూరంగా ఉండాలి. అలా చేసే ప్రమాణానికి కట్టుబడి ఉండాలని భాసిన్ అన్నారు. కానీ జస్టిస్ అరుణ్ మిశ్రా ఇందుకు విరుధ్ధంగా ప్రవర్తించారు అభిప్రాయపడ్డారు.

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు జస్టిస్ మిశ్రా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోడీ దూరదృష్టి ఉన్న నేత అని, బహుముఖ మేధావి అంటూ ప్రశంసలు కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు ఉత్తేజకరంగా, సమావేశాలకు ఎజెండాను నిర్ణయించడానికి స్పూర్తిగా ఉంటాయంటూ.. ఆయనొక బహుముఖ మేధావి అంటూ కీర్తించారు.

Read: మోడీ బహుముఖ మేధావి : సుప్రీంకోర్టు జడ్జీ ప్రశంసలు

Bar Association
Deeply Concerned
Supreme Court judge
Effusive Praise
PM

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు