కోతులకూ తప్పని లాక్ డౌన్ కష్టాలు : తిండి దొరక్క ఇళ్లపై దాడి

Submitted on 9 April 2020
Ayodhya monkeys angry with hunger amid lockdown, Attacking Humans

లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు .... కోతులపైనా పడింది. అవి  తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీంతో గుళ్లకు వచ్చే భక్తులే కరువయ్యారు. భక్తులు ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకునే కోతులు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాయి. 

ఆహారం దొరక్క బక్కచిక్కి పోతున్నాయి. కడుపు కాలటంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. ఆకలికి తట్టుకోలేక నగరంలోని ఇళ్లపైక లంఘిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి దొరికిన ఆహార పదార్ధాలు ఎత్తుకెళుతున్నాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. 

అయోధ్యలో సుమారు 8 వేల కోతులున్నాయని అంచనా. ఇన్నేళ్ళుగా ఇక్కడున్న వానరాలకు ఇటువంటి కష్టం  ఎప్పుడూ రాలేదు. గుళ్లకు వచ్చేభక్తులు ఇచ్చే అరటి పళ్లు కొబ్బరి చిప్పలు, రొట్టెలు, పూరి లాంటివి తిని బతికేవి,  కొందరు పప్పులు చిరు ధన్యాలు వేసేవారు. కానీ గత రెండు వారాలుగా గుళ్లు మూసి వుండటంతో భక్తులు రాకపోవటంతో వానరాలు ఇళ్లపై  దాడులు చేస్తున్నాయి. 

కొందరు వ్యాపారస్తులు వాటికి కొద్దిపాటి పప్పు ధాన్యాలు, రొట్టెలు వేస్తున్నారు. అవి వాటి ఆకలిని తీర్చలేక పోతున్నాయని ఒక వ్యాపారి చెప్పాడు.  లాక్ డౌన్ అమలవుతున్నందు వారికి తినటానికి ముందు జాగ్రత్త చర్యగా కొంత నిల్వ చేసుకుంటున్నామని అతను చెప్పాడు. 

Also Read | జీడిపప్పు, బాదం, గుడ్లు.. ఏపీలో కరోనా బాధితుల ఫుడ్ మెనూ ఇదే

Ayodhya
monkeys
Angry
hunger
LOCKDOWN
Attacking Humans
Food
starving monkeys
coronavirus
Covid-19

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు