విజయశాంతి మాస్టర్ కిక్.. వైరల్ అవుతున్న వీడియో

Submitted on 14 January 2020
After 13 years.. What a come back  vijayashanthi MASTER KICK

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ యాక్టింగ్, డ్యాన్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

విడుదలైన మూడు రోజుల్లోనే రూ.వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరైందీ చిత్రం. 13 ఏళ్ల విరామం తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రొఫెసర్ భారతి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారామె. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియోను  దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ వీడియోలో నటుడు బ్రహ్మాజీకి విజయశాంతి కాలితో కిక్ ఇస్తున్నారు. స్లో మోషన్‌లో తీసిన వీడియో ఆకట్టుకుంటోంది. ‘13 సంవత్సరాల తర్వాత.. వాట్ ఎ కమ్ బ్యాక్ మేడమ్.. విజయశాంతి మేడమ్ మాస్టర్ కిక్’ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు విజయశాంతిని అభినందిస్తున్నారు.  

Sarileru Neekevvaru
Lady Amitabh vijayashanthi
vijayashanthi MASTER KICK

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు