actor-irrfan-khan-dies-mumbai-53

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) కన్నుమూశారు. కోలన్ ఇన్ఫెక్షన్ తో ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-29,2020)ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన లండన్ లో ట్రీట్మెంట్ తర్వాత కొద్ది నెలల క్రితం ముంబైకి తిరిగివచ్చిన విషయం తెలిసిందే.

ఇర్ఫాన్ ఖాన్ కు భార్యా,ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం రోజు ఇర్ఫాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచినట్లు ఆయన ప్రతినిధి తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన మరణించినట్లు కన్ఫర్మ్ చేశారు. కాగా, ఆదివారం(ఏప్రిల్-26,2020)ఇర్ఫాన్ తల్లి సయూదా బేగమ్ 95ఏళ్ల వయస్సులో జైపూర్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా అప్పుడు ఇర్ఫాన్ ఖాన్  ముంబై నుంచి తల్లిని చివరిచూపు చూసేందుకు జైపూర్ వెళ్లలేకపోయారు. వీడియో కాల్ ద్వారా తన తల్లికి నివాళులర్పించిన విషయం తెలిసిందే.

 

ఇర్పాన్ ఖాన్ కి న్యూరోఎండోక్రిన్ కణితి ఉన్నట్లు 2018 మార్చిలో నిర్ధారణ అయింది. వెంటనే చికిత్స కోసం లండన్ వెళ్లాడు. ఆంగ్రేజీ మీడియం సినిమా చిత్రీకరణ కోసం అతను ఫిబ్రవరి 2019 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కొంతకాలం దేశంలో గడిపిన తరువాత తిరిగి లండన్ వెళ్లాడు. లండన్‌లో సర్జరీ మరియు ట్రీట్మెంట్ తర్వాత ఈ నటుడు 2019 సెప్టెంబర్‌లో తిరిగి ముంబై వచ్చాడు. 1988లో సలాం బాంబే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇర్పాన్ ఖాన్…తెలుగులో కూడా మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.