ఎన్నికల ఎఫెక్ట్ : ఏపీ గ్రూపు 1 పరీక్ష వాయిదా

Submitted on 14 March 2019
APPSC Group 1 Preliminary Exams postponed

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. నేతలు ప్రచారంతో బిజీ బిజీగా ఉంటే విద్యార్థులు మాత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. గ్రూపు 1 ప్రిలిమనరీ పరీక్షకు సిద్ధమౌతున్నారు. మార్చి 31న ఈ పరీక్ష జరుగనుంది. అంతలో ఏపీపీఎస్సీ ఓ నిర్ణయం తీసుకుంది. గ్రూపు 1 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మే 26న ఎగ్జామ్ నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్షకు మరికాస్త టైం దొరకడంతో కొంతమంది హ్యాపీగా ఫీలవుతున్నారు. 

వాస్తవానికి గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష మార్చి 10వ తేదీన జరగాల్సి ఉంది. అభ్యర్థులు దీనిని వాయిదా వేయాలని కోరారు. దీనితో మార్చి 31న పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. 

appsc
group 1
Preliminary
Exams
postponed
Andhrapradesh News
Education Nees
TSPSC

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు