ఇండియాలో ఎప్పుడంటే : ఆపిల్ కొత్త TV App వచ్చేసింది

Submitted on 15 May 2019
Apple Company New TV App is rolling out in Top countries including India around World 

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ కొత్త ప్రొడక్టులను రిలీజ్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో  ఆపిల్ మార్కెట్ సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త ఐఫోన్ల సిరీస్ ను వచ్చే కొన్ని నెలల్లో ఆపిల్ లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే.. మొబైల్ యూజర్లను ఆకట్టకునేందుకు మొబైల్ టీవీ యాప్ ను ఆపిల్ ప్రవేశపెట్టింది. ఇండియాతో కలిపి మొత్తం 100 దేశాల్లో Apple TV కొత్త యాప్ ను రిలీజ్ చేసింది. ఈ కొత్త టీవీ యాప్.. ఐఫోన్ డివైజ్ లు, ఐప్యాడ్స్, ఆపిల్ టీవీలతో పాటు శాంసంగ్ స్మార్ట్ టీవీల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఒకసారి పేమెంట్ చేస్తే చాలు :
2019 లైన్ అప్ లో భాగంగా ఆపిల్ ఈ సరికొత్త టీవీ యాప్ ను ప్రవేశపెట్టింది. ఆపిల్ టీవీ యాప్ ప్రవేశపెట్టిన వంద దేశాల్లో.. ఇండియాతో సహా అమెరికా, కెనడా, నేపాల్, ఆఫ్రికన్, మిడిల్ ఈస్టరన్ కంట్రీలు ఆపిల్ టీవీ యాప్ యాక్సస్ చేసుకోవచ్చు.
Also Read : ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ : హైదరాబాద్‌లో OnePlus ఎక్స్‌పీరియ‌న్స్‌ సెంటర్

‘ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కస్టమర్లు.. ఫ్రీ iOS 12.3, tvOS 12.3 సాఫ్ట్ వేర్ అప్ డేట్ పొందవచ్చు. ఆపిల్ టీవీ ఛానళ్లను ఆపిల్ టీవీ యాప్ ద్వారా సబ్ స్ర్కైబ్ చేసుకోవచ్చు. ఒకసారి పేమెంట్ చేస్తే చాలు.. నేరుగా నచ్చిన ఛానళ్లను టీవీ యాప్ పై వీక్షించవచ్చు’ అని కంపెనీ తమ బ్లాగ్ పోస్టులో తెలిపింది. 

ఆరుగురు సభ్యుల వరకు షేరింగ్ :
ఆపిల్ టీవీ యాప్ ను.. ఫ్యామిలీ షేరింగ్ ఫీచర్ ద్వారా ఆరుగురు సభ్యుల వరకు తమ సబ్ స్ర్కిప్షన్ ను షేర్ చేసుకోవచ్చు. ఆపిల్ టీవీ ఛానళ్లను యాక్సస్ చేసుకోవాలంటే.. యూజర్లు ఆపిల్ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. Apple TV యాప్ యూజర్లు.. టీవీ షోలను వీక్షించవచ్చు.. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో కూడా వీక్షించవచ్చు. ఆఫ్ లైన్ లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వీక్షించే సదుపాయం కూడా ఉంది.

చిన్న పిల్లల కోసం స్పెషల్ కంటెంట్.. స్పోర్ట్స్ సెక్షన్.. అన్ని వయస్సుల వారు వీక్షించేందుకు వీలుగా ఆపిల్ టీవీ యాప్ ఫీచర్లను డిజైన్ చేసింది. ఆపిల్ టీవీ యాప్ 2019 ఏడాది తర్వాత మ్యాక్ బుక్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ లో.. ఆపిల్ ఒరిజినల్ వీడియో సబ్ స్ర్కిప్షన్ సర్వీసు Apple TV+ ను రానున్న నెలల్లో ప్రవేశపెట్టనుంది. 
Also Read : కాలాంతకులు : వెయ్యి రూపాయల సాఫ్ట్‌వేర్ తో వాట్సాప్‌ కే బురిడీ!

Apple
 Apple TV App
india
iPhones
Apple TV channels
Ipads
Samsung smart TV 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు