నేడే AP PGECET-2019 ఫలితాలు

Submitted on 14 May 2019
AP PGECET 2019 Results To Be Released Today On 4pm

ఏపీలో M Tech, M Pharmacy కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (AP PGECET) ఫలితాలు మంగళవారం (మే 14, 2019)న సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) చైర్మన్‌ ఆచార్య ఎస్‌.విజయరాజు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్ధులు తమ ఫలితాలను PGECET అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. 

AP PGECET పరీక్షలను ఆంధ్రా యూనివర్సిటీ మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించింది. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మెదటి పరీక్ష. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో పరీక్ష. ఇలా రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 24,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

AP PGECET
results
Released Today
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు