ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారు...చంద్రబాబుకు బొత్స సూటి ప్రశ్న

Submitted on 19 September 2019
ap minister botsa press meet on chandrababu complaint to Governor

గవర్నర్ వ్యవస్ధ  కేంద్రానికి ఒక ఏజెంట్ అని, పనికిమాలినది  వ్యవస్ధ అని వ్యాఖ్యానించిన చంద్రూబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.  ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మీటింగ్ లో గవర్నర్ వ్యవస్ధ పనికిరాని వ్యవస్ధ  అన్న మనిషి ఈ రోజు  గవర్నర్ ను కలిశారని  బొత్స  వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడుతున్నారు. ఇదేనా చంద్రబాబు గారి 40 ఇయర్స్ ఆఫ్ ఇండ్రస్ట్రీ... అని ఎద్దేవా చేశారు. 

రెండురోజుల క్రితం కోడెల మృతిపై సీబీఐఎంక్వైరీ కోరిన చంద్రబాబు  ఈరోజు గవర్నర్ కు ఇచ్చినలేఖలో ఆవిషయం ప్రస్తావించలేదని బొత్స  అన్నారు.  సీబీఐ వ్యవస్ధ కూడా కేంద్ర చెప్పుచేతుల్లో ఉందని, ఆర్నెల్ల క్రితం సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని చెప్పిన వ్యక్తి ఇప్పుడెలా డిమాండ్ చేస్తున్నారిని బోత్స ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఆర్నెల్లలో ఏం మార్పు వచ్చిందో చంద్రబాబే చెప్పాలని అన్నారు.  సీబీఐమీద నియంత్రణ విధించిన వ్యక్తి ఈ రోజు ఏ మొఖం పెట్టుకుని డిమాండ్ చేస్తున్నారని బొత్స అన్నారు.  

గత 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో  ఏ వ్యవస్ధ కూడా సక్రమంగా పని చేయలేదని,  ఏ చట్టాన్నీ సక్రమంగా అమలు చేయలేదని ప్రతి దాన్ని ఉల్లంఘించారని ఆయన తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు చెయ్యమని  చంద్రబాబు ఆదేశాలు జారీచేశారని గుర్తు చేశారు. సూసైడ్ కేసులో కీలకమైన  కోడెల సెల్ ఫోన్  కనిపించకుండా పోయిందని దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరని  బొత్స ప్రశ్నించారు.  ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇస్తే 5 ఏళ్లు ప్రజాసంక్షేమం పట్టించుకోకుండా జగన్ మోహన్ రెడ్డి పై కక్ష తీర్చుకోవాలనే చూశారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షా 26 వేల ఉద్యోగాలు కల్పించి ఉపాధి చూపారని బొత్స అన్నారు.

కుళ్లు ఆలోచనలు, కుతంత్రాలు...దిక్కుమాలిన ఆలోచనలు తప్ప ఎప్పడూ మంచి ఆలోచనలు చంద్రబాబుకు రాలేదని దుయ్యబట్టారు.  కోడెల మృతిపై మాజీ సీఎం  హోదాలో  హుందాగా వ్యవహరించకుండా రచ్చ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వత్తిడి వల్లే కోడెల సూసైడ్ చేసుకున్నారు. కోడెల బీజేపీలో చేరుతున్నారనే కారణంతో 3 నెలలుగా ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు తప్పించుకు తిరిగారని ఆయన వివరించారు. కనిపించకుండా పోయిన కోడెల సెల్ ఫోన్ ఏమైందో కుటుంబ సభ్యులు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.  కోడెల కుటుంబంపై అభియోగాలు వచ్చినప్పుడు పార్టీ తరుఫున ఎందుకు ఖండించలేదో చంద్రబాబు చెప్పాలని బొత్స అన్నారు.
 

Andhra Pradesh
Botsa Satyanarayana
Chandrababu Naidu
TDP
Governor
kodela sucide case

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు