Ap-ESI has also been identified as a huge scam

బిగ్ బ్రేకింగ్ : ఏపీ ESIలో భారీ స్కామ్!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలో కూడా భారీ కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు. 2014-19 మధ్య మందులు, వైద్య పరికరాలు కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ..వందల కోట్ల స్కామ్ ఈ ఆరు సంవత్సరాల్లో జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు.

డైరెక్టర్లు రమేష్, రవికుమార్, విజయ్ ఈ ముగ్గురు డైరెక్టర్ల హయాంలోనే వందల కోట్ల నకిలీ బిల్లులు బయటపడ్డాయి. నకిలీ కొటేషన్లతో లేని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. వాస్తవ ధరకంటే 132 శాతం అధికంగా ఇచ్చినట్లు తేలింది. దీంతో గత ఆరేళ్లనుంచి జరగుతున్న ఈ దందాతో ప్రభుత్వానికి రూ.404 కోట్ల నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు.  

నకిలీ సంస్థలకు 52 కోట్లు చెల్లింపులు చేశారు. ఈ ముగ్గురి డైరెక్టర్లకు  జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు, సీనియర్ అసిస్టెంట్ లు  సహకరించినట్లుగా నిర్ధారణ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓమ్నీ మెడీ లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఎన్వెంటర్ పెర్మార్మెన్స్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంటు శాఖ విడుడల చేసింది.

ఈఎస్‌ఐ డైరెక్టర్లు రవికుమార్‌, రమేష్‌, విజయ్ ల హస్తం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఓమ్మిమేడి ఎన్వెంటర్‌ ఫెర్ఫామెన్స్‌ సంస్థలకు అక్రమంగా 85 కోట్ల రూపాయిలను డైరెక్టర్లు చెల్లించారు. ఆ ఈఎస్‌ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్‌ డైరెక్టర్లు సహకరించారని తేలింది. 

Read More>>అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

Related Posts