ap cm ys jagan high level review on covid 19 prevention

రెడ్‌ జోన్ల వారీగా కరోనా పరీక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్‌ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్‌ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరించి, ఆ మేరకు డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని పరిస్థితులను అంచనా వేయాలని ఆయన సూచించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలే కాకుండా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై  ఈ సమావేశంలో చర్చించారు. 
 

వేగవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారి గుర్తించాలని ఆయన సూచించారు. వీరిలో ఎవరెవరికి పరీక్షలు చేయించాలన్న దానిపై వైద్యులు నిర్ధారిస్తున్నారు. త్వరలో వీరందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతోంది.  స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్‌ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎవరైనా ఫోన్‌ చేసి వైద్యం పొందవచ్చు.  క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగు పరచాలని…. సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఈ విషయంలో రూపొందించుకున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం ముందు కెళ్లాలన్నారు.. 

కరోనా నివారణ కోసం  ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, పనితీరు పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ఐసీయూ బెడ్లు, వాటి సంఖ్యకు తగినట్టుగా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని…. వారం రోజుల పాటు సేవలు అందించిన వైద్య సిబ్బందిని తర్వాత 14 రోజుల పాటు ఐసోలేషన్‌కు పంపించేలా రూపొందించుకున్న ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు ఎక్కువ మంది వైద్యులు, సిబ్బంది అవసరం. తగిన చర్యలు తీసుకోవాలి..కోవిడ్‌–19 ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్లు, మాస్కులు తగినన్ని అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ చెప్పారు.

గుజరాత్‌లో ఉన్న తెలుగు వారి బాగోగులు చూసుకోవడానికి ఏపీ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన అధికారుల బృందం. అక్కడ తెలుగు వారందరికీ భోజన, ఇతర సదుపాయాలను చూసుకోవాలని వారితో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రత్యేక క్యాంపుల్లో సదుపాయాల కల్పన. క్యాంపు అధికారిగా హాస్టల్‌ వార్డెన్లు. జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియామకం. ఎప్పటికప్పుడు పరిస్థితిపై పర్యవేక్షణ….అవసరాలకు అనుగుణంగా క్యాంపుల పెంపు. అన్ని రకాల సదుపాయాల కల్పన…..1902కు వచ్చిన కాల్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి చర్యలు. ప్రతి కాల్‌కు స్పందించాల్సిందేనని సీఎం అధికారులను ఆదేశించారు.