ఏపీ ఎన్నికలు : పోటీలోని కోటీశ్వరులు వీరే

Submitted on 22 March 2019
Andhra Pradesh elections 2019.. Crorepatis in race

అమరావతి: ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వీరిలో కొందరు కోటీశ్వరులు ఉన్నారు. వారి ఆస్తుల వివరాలు  ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు ఏపీలో నామినేషన్లు వేసిన వారిలో కొందరి ఆస్తులు వంద కోట్ల పైమాటే. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ అభ్యర్థి శ్రీభరత్.. వైసీపీ అభ్యర్థులు రఘరామ  కృష్ణంరాజు, మిథున్ రెడ్డిలు కోటీశ్వరుల జాబితాలో టాప్ లో ఉన్నారు.
Read Also : సీఎంల పనితీరుపై ర్యాంకులు : కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14

బాలయ్య చిన్నల్లుడు, గీతం యూనివర్సిటీ ఎంవీవీఎస్ మూర్తి మనువడు శ్రీభరత్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన ఆస్తుల  విలువ రూ.200 కోట్లు. నర్సాపురం లోక్ సభ వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణమరాజు ఆస్తులు రూ.300 కోట్లు కాగా,  రాజంపేట లోక్ సభ వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఆస్తులు రూ.67 కోట్లు.

* 2014-15 లో భరత్ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు. 2018-19 కి ఆ మొత్తం రూ.23 లక్షలకు పెరిగింది.
* శ్రీభరత్ భార్య తేజస్విని వార్షిక ఆదాయం 2014-15 లో రూ.10లక్షలు. 2018-19లో రూ.57లక్షలకు పెరిగింది.
* భరత్ పేరిట రూ.190 కోట్ల స్తిరాస్తులు ఉన్నాయి. గుర్గావ్ లో ఫామ్ హౌస్ ఉంది. తేజస్విని పేరు మీద రూ.27 కోట్ల స్తిరాస్తులు ఉన్నాయి.
* కంపెనీల్లో రూ.5.52 కోట్ల పెట్టుబడులున్నాయి. సిద్దేశ్వరి పవర్ జనరేషన్, వీబీసీ రెనివబుల్ ఎనర్జీ, నాచురల్ సాండ్స్, బాసిల్ ఇన్ ఫ్రా, వీబీసీ ఇండస్ట్రీస్, వీబీసీ ఫెర్రో అల్లాయ్స్ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.
* తేజస్వినికి మెడ్విన్ లో పెట్టుబడులు ఉన్నాయి. వజ్రాలు, బంగారం, వెండి, బ్యాంకు డిపాజిట్ల రూపంలో రూ.7.26 కోట్లు ఉన్నాయి.
* శ్రీభరత్ కొడుకు పేరిట రూ.2.26 కోట్ల ఆస్తులున్నాయి.


* నర్సాపురం లోక్ సభ వైసీపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజు పేరిట రూ.324 కోట్ల ఆస్తులున్నాయి.
* రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి పేరు మీద రూ.67 కోట్లు ఆస్తులున్నాయి.
* అసెంబ్లీ అభ్యర్థుల్లో గౌతమ్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి అత్యధిక ఆస్తులు ఉన్న వారి జాబితాలో టాప్ లో ఉన్నారు.
Read Also : సీటు గోవిందా..! : సిట్టింగ్‌లకు నో ఛాన్స్

Andhra Pradesh Elections 2019
Crorepatis
race
Candidates
TDP
Ysrcp
sri bharat
raghurama krishnam raju
mithun reddy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు