amruta Pranay sun Mother Girija comming key poins her press meet

నా కొడుకుని చూడటానికి మా అమ్మ వచ్చింది..కానీ చూపించలేదు : అమృత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత మీడియా సమావేశంలో కూతురు అమృత పలు సంచలన విషయాలను వెల్లడించింది. నా భర్త ప్రణయ్ చనిపోయిన తరువాత నాకు పుట్టిన బిడ్డను చూడటానికి మా అమ్మ ఒకసారి నా దగ్గరకు  వచ్చింది. బాబుని చూపించమని అడిగింది. కానీ నేనేను చూపించనని చెప్పాననీ తెలిపింది అమృత. 

చనిపోయిన మనిషికి మర్యాద ఇవ్వాలని..భర్తను పోగొట్టుకున్న మా అమ్మను చూడటానికే నేను శ్మశానానికి వెళ్లాలనని కానీ మారుతీరావు బంధువులు నన్ను రానివ్వలేదని కూతురు అమృత తెలిపింది. భర్త ఎటువంటివాడైనా ఆ భర్తను పోగొట్టుకున్న భార్య పరిస్థితి ఎలా ఉంటుందో..నాకు బాగా తెలుసు..ఎంత బాధగా ఉంటుందో ఆ బాధను నేను అనుభవిస్తున్నాను.. అందుకనే నేను మా అమ్మను చూడటానికి శ్మశానానికి వెళ్లానని తెలిపింది అమృత. 

కానీ ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు పశ్చాత్తాపంతంతో ఆత్మహత్య చేసుకోలేదని స్పష్టంచేసింది. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో మారుతీరావు ‘అమృతను ఉద్ధేశించి..అమృతా ఇప్పటికైనా నువ్వు అమ్మదగ్గరు వెళ్లమ్మా’ అని నోటులో రాసిపెట్టారనీ..మరి నువ్వు మీ అమ్మదగ్గరకు వెళతామా అని మీడియా ప్రశ్నించగా..అమృత తనదైన శైలిలోనే స్పందించింది.  నేను మా అమ్మ దగ్గరు వెళ్లేది లేదు.  నా భర్తను కోల్పోయిన తరువాత నా అత్తింటివారు నాకు అండగా నిలబడ్డారు. అత్తయ్య..మామయ్య అంతా నాకోసం ఉన్నారు. కానీ ఇప్పుడు మా అమ్మకు ఎవ్వరూ లేరు. ఆమె ఇప్పుడు ఒంటరిది. నేను ఆమె దగ్గరు వెళ్లను కానీ ఆమె నాదగ్గరకు వస్తే ఒక కూతురిగా బాగా చూసుకుంటానని తెలిపింది అమృత. 

నా పెళ్లి..ఇంట్లో విభేధాలు..ఇంట్లోంచి వచ్చి ప్రణయ్ కు పెళ్లి చేసుకన్న తరువాత నా తండ్రి మారుతీరావు నా భర్త ప్రణయ్ ను కిరాతకంగా హత్య చేయించాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన మారుతీరావును ఈ దారుణ హత్యకు పాల్పడినవారిని శిక్షించాలని కోర్టుకెక్కాను..అది అన్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించింది. కానీ నా వల్లనే మారుతీరావు చనిపోయాడని వారి బంధువులు అంటున్నారు. కానీ భర్తను పోగొట్టుకుని నేను అన్యాయం అయిపోలేదా? చంపినవారికి అన్యాయం జరిగిందంటూన్నారు. కొడుకుని పోగొట్టుకుని నా అత్తమామలు..భర్తను పోగొట్టుకుని నేను అన్యాయం అయిపోలేదా? అని ప్రశ్నించింది అమృత.  

మారుతీరావు ఏకైక కుమార్తె అమృతవర్షిణి. అమృత 2018 మేలో మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రణయ్‌ కుమార్‌ను ప్రేమించి హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ను కిరాయి వ్యక్తులు హత్య చేయగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు పలు ఒత్తిడులకు గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.