జనగణమన పాడిన అమెరికా సైనికులు : ప్రతీ ఒక్కరూ చూడాల్సిన వీడియో

Submitted on 19 September 2019
American Army band playing Indian National Anthem ‘jana gana mana’ during the Exercise Yudh Abhyas 2019 at Joint Base Lewis, McChord

అమెరికా సైనికులు భారతదేశపు జాతీయ గీతాన్ని ఆలపించారు.అద్భుతం..అనిర్వచనీయమైన ఈ దృశ్యం..వాయిద్యాలతో అమెరికా సైనికులు ఆలంపించిన మన జాతీయ గీతం ‘జనగణమన’ వింటే ..భారతీయుల మనస్సే కాదు ప్రతీ ఒక్కరి గుండె పులకించిపోకమానదు. వాయిద్యాలతో  అంతగా బాగా వినిపించారు అమెరికా సైనికులు.  

భార‌త‌, అమెరికా మ‌ధ్య సైనిక విన్యాసాలు అత్యంత ఉత్సాహంగా జ‌రిగాయి. ఈ క్రమంలో అమెరికాలోని మెకార్డ్ జాయింట్ బేస్ లూయిస్ వ‌ద్ద యుద్ధ అభ్యాస్ విన్యాసాలను అంగరంగ వైభోగంగా నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి 16 వ‌ర‌కు అభ్యాస్ విన్యాసాలు జరిగాయి.  ఉత్సాహంగా కొనసాగిన ఈ  విన్యాసాలు ముగింపు రోజున‌.. భార‌త దేశపు జాతీయ గీతం ‘జ‌న‌గ‌ణ‌మ‌ణ’ గీతాన్ని అమెరికా సైనికులు వాయిద్యాలతో పాడి వినిపించారు.

అమెరిక‌న్ ఆర్మీ బ్యాండ్ ..భార‌త జాతీయ గీతాన్ని వినసొంపుగా..ఎక్కడా రిథమ్ పోకుండా చక్కగా ప్లే చేసింది. అమెరికా సైనికులు జ‌న‌గ‌ణ‌మ‌ణ పాట‌ను త‌మ బ్యాండ్‌లో వినిపించ‌డం ప‌ట్ల భార‌తీయ సైనికులు సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను విన్న ప్రతీ ఒక్క భారతీయుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కూడా వినండి అమెరికా సైనికులు పాడిన మన జాతీయ గీతాన్ని..

American
Army band
playing
Indian Nationa Anthem
‘jana gana mana’
Exercise Yudh Abhyas
2019
Joint Base Lewis
McChord

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు