సైక్లోన్ సైకిలేసుకొచ్చింది- ఎబీసీడీ సెకండ్ సాంగ్ రిలీజ్

Submitted on 22 April 2019
America Naa America Lyrical Video from ABCD Movie-10TV

ఒక్కక్షణం తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమా ఏబీసీడీ.. (అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ) అనేది ట్యాగ్ లైన్.. రిచ్ కిడ్ అయిన ఒక కుర్రాడికి, ఇండియాలో పేదవాడిగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే పాయింట్‌తో మలయాళంలో తెరకెక్కిన ఏబీసీడీ మూవీని, అదే పేరుతో తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నారు.. కృష్ణార్జున యుద్ధం ఫేమ్ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌‌గా నటిస్తుంది.
Also Read : ఏదైనా జరగొచ్చు- టీజర్

సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, పెళ్ళి చూపులు ఫేమ్, యష్ రంగినేని కలిసి నిర్మిస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి, 'మెల్ల మెల్లగా' అనే మెలోడీ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఎబిసీడీ నుండి మరో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

'అమెరికా నా అమెరికా నిను మిస్సవుతున్నా బాగా'.. అనే సాంగ్ వినసొంపుగా ఉంది. జుదా శాండీ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, భాస్కరభట్ల లిరిక్స్ వ్రాశాడు. బెన్నీ దయాల్, సంజిత్ హెగ్డే చాలా బాగా పాడారు. అమెరికా నుండి ఇండియాకొచ్చి ఇక్కడ పడుతున్న కష్టాలన్నిటినీ ఈ లిరికల్ సాంగ్ రూపంలో వివరించే ప్రయత్నం చేసారు. మే 17 న ఏబీసీడీ రిలీజ్ కానుంది. 
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

ఈ సినిమాకి సంగీతం : జుదా శాండీ, కెమెరా : రామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : వర్మ, కొరియోగ్రఫీ : విజయ్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ధీరజ్ మెగిలినేని.

వాచ్ లిరికల్ సాంగ్... 
 

Allu Sirish
Rukshar Dhillon
Judah Sandhy
Bhaskarabhatla
Benny Dayal
Sanjith Hegde
Sanjeev Reddy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు