America Laser Weapon

అమెరికా అమ్ముల పొదిలో మరో అత్యాధునిక ఆయుధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విమానాలను ఆకాశంలోనే విధ్వంసం చేసే సరికొత్త లేసర్ ఆయుధాన్ని అమెరికా సిద్ధం చేసుకుంది. కొత్త లేజర్ ఆయుధం పరీక్ష విజయవంతం అయ్యిందని అమెరికా నేవీ పసిఫిక్ విభాగం శుక్రవారం ప్రకటించింది. అమెరికా పరీక్షించిన లేసర్ ఆయుధం 150 కిలోవాట్ ల సామర్ధ్యం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
పసిఫిక్ యమహా సముద్రంలో అమెరికా నేవీ ఒక కొత్త లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది.

యుఎస్ఎస్ పోర్ట్ ల్యాండ్ ఓడ పై నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. దాన్నుంచి ప్రయోగించిన లేసర్ ఆకాశంలో ప్రయాణిస్తున్న డ్రోన్ విమానాన్ని కూల్చిన వీడియొ దృశ్యాలను అమెరికన్ నేవీ విడుదల చేసింది. కొత్త లేసర్ ఆయుధం పరీక్ష విజయవంతం అయ్యిందని అమెరికన్ నేవీ పసిఫిక్ విభాగం ప్రకటించింది. కాకపోతే పసిఫిక్ మహాసముద్రంలో కచ్చితంగా ఏ ప్రాంతంలో ఈ పరీక్ష చేశారో మాత్రం చెప్పలేదు.

ఈ కొత్త ఆయుధాన్ని సాంకేతికంగా ”హై ఎనర్జీ క్లాస్ సాలిడ్ స్టేట్ లేసర్” అంటారు. మే నెల 16 వ తేదీన పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. కొత్త లేసర్ ఆయుధం సామర్ధ్యం మాత్రం అమెరికా వెల్లడించలేదు. 2018లో ప్రచురించిన ఒక అధ్యయనంలో మాత్రం దాని సామర్ధ్యం 150 కిలోవాట్ లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో సముద్రాలపై సాగే యుద్ధాల్లో ఇప్పుడొక కొత్త అధ్యాయం ప్రారంభమైందని అమెరికన్ నేవీ పసిఫిక్ విభాగం ప్రకటించింది. డ్రోన్లు, సాయుధ బోట్లను ఇది పేల్చివేస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే ఈ కొత్త లేసర్ ఆయుధం కాంతి వేగంతో ప్రయాణిస్తుంది.