షాకింగ్ దృశ్యాలు : 3 వారాలుగా Amazonలో మంటలు

Submitted on 22 August 2019
Amazon Rainforest Is Ablaze, Turning Day Into Night In Brazil from 3 Weeks Smoke

సౌత్ అమెరికన్ దేశాల్లో విస్తరించిన ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మంటల్లో కాలిపోతోంది. జీవవైవిధ్యానికి పెట్టింది పేరైనా అమెజాన్‌ ఫారెస్టు అగ్నికి ఆహుతి అయిపోతోంది. 3 వారాలుగా అమెజాన్ లో మంటలు భారీగా వ్యాపిస్తున్న ఇప్పటివరకూ పట్టించుకున్న నాథుడే లేడు.

బ్రెజిల్ ప్రభుత్వం కూడా సైలంట్ అయిపోయింది. భూగ్రహంపై జీవనదులు, ఎన్నో జీవాలకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఊపిరి పోస్తోంది. అధిక మొత్తంలో వెలువడే కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది.

అలాంటి అమెజాన్ ఫారెస్టులో అగ్నికిలలు ఎగసిపడుతున్నాయి. పచ్చని చెట్లతో కళకళలాడే ఫారెస్ట్ మంటల్లో దగ్ధమైపోతోంది. సాయో పౌలోలో రాత్రికి రాత్రే ఉన్నట్టుంటి మంటలు చెలరేగాయి. ప్రాణికోటిని రక్షించే అమెజాన్ ఫారెస్టును కాపాడే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫారెస్ట్ మంటలు చెలరేగడానికి కారణం ఎవరో సరైన ఆధారాలు లభించలేదు. దీనిపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

బ్రెజిల్ ప్రభుత్వం భూ వినియోగ విధానాలపై వివాదం తీవ్రతరం అవుతోంది. బ్రెజిల్ నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఫర్ స్పెస్ రీసెర్చ్ (BNISR) డేటా ప్రకారం.. జనవరి నుంచి బ్రెజిల్ అమెజాన్ ఫారెస్టులో 74వేల 155 మంటల్లో దగ్ధమైనట్టు తెలిపింది.

విచారకరం.. మీడియా ఎక్కడ? : డికాప్రియో
అమెజాన్ రెయిన్ ఫారెస్టు మంటల్లో కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడంపై ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్, పర్యావరణవేత్త లియోనార్డో డికాప్రియో స్పందించారు. 16 రోజులుగా ఫారెస్టులో కాలిపోతున్నా కనీసం మీడియా కవరేజ్ కూడా ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు.

గతంలో కూడా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇదే అంశంపై ప్రస్తావించారు. అమెజాన్ ఫారెస్ట్ మంటల్లో కాలిపోయే దృశ్యాలను డికాప్రియో పోస్టు పెట్టారు.. అమెజాన్ ఫారెస్ట్ కాలిపోతుంది ఆలోచించడానికే భయమేస్తోంది. భూమిపై 20శాతం ఆక్సిజన్ ఇదే అందిస్తోంది. గత 16 రోజులుగా మంటలు భారీగా విస్తరిస్తున్న కనీసం ఒక్క మీడియా కవరేజ్ ఇవ్వకపోవడం బాధాకారం’ అని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వాపోయారు.

ఈ ఫారెస్టు లేదంటే.. మనమే లేం : అలియా భట్
దీనిపై సినీనటి అలియా భట్ కూడా స్పందించారు. ఎన్నో జీవాలకు నివాసమైన అమెజాన్ ఫారెస్టులో 3 మిలియన్ల జాతులు జీవిస్తున్నాయి. జంతువులతో పాటు 1 మిలియన్ మంది దేశీయ ప్రజలు ఉన్నారు. భూమిపై కార్బన్ డైయాక్సైడ్ స్థాయిని చెక్ చేస్తూ ఫారెస్ట్ కంట్రోల్ చేస్తోంది. ఇది లేదంటే మనమే లేమని గుర్తించాలని అలియా ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు.

Amazon Rainforest
Amazon fire
brazil
Sao Paulo 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు