ఎన్నాళ్లకెన్నాళ్లకు : వచ్చే వారం భారత్ కు ట్రంప్

Submitted on 23 September 2019
'Am I Invited': Trump Tells PM Modi He May Come for India's First NBA Match to Be Held in Mumbai

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2016లో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్ కు ట్రంప్ రానున్నారు. అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్(NBA)ఇండియా గేమ్స్-2019లో భాగంగా అక్టోబర్ 4,5న ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో బాస్కెట్ బాల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. శాక్రమెంటో కింగ్స్-ఇండియానా పేసర్స్ ఇందులో తలపడబోతున్నాయి. ఈ గేమ్ చూసేందుకు ట్రంప్ ముంబైలో అడుగుపెట్టనున్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడే తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం(సెప్టెంబర్-22,2019)రాత్రి అమెరికాలోని హ్యూస్టన్ లోని  ఎన్ఆర్ జీ స్టేడియంలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరైన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా భారత ప్రధానిపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ కూడా ట్రంప్ మరోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావాలని ఆకాంక్షించారు.

ట్రంప్ తన ప్రసంగ సమయంలో....అతి త్వరలో భారత్ లో వరల్డ్ క్లాస్ అమెరికన్ ప్రొడక్ట్ ఎన్బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగనుంది. ముంబైలో వచ్చే వారం జరిగే ఈ మ్యాచ్ ను వేలాదిమంది దగ్గరగా చూడనున్నారు. నేను ఆ మ్యచ్ చేసేందుకు రావచ్చా మిస్టర్య ప్రైమ్ మినిస్టర్ అని ట్రంప్ ఈ సందర్భంగా మోడీని చూస్తూ మాట్లాడారు. నేను ఈ మ్యాచ్ చూసేందుకు రావచ్చు అని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగం ముగింపులో ట్రంప్ ను భారత్ కు ఆహ్వానించారు. 2017 నవంబర్ లో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు ట్రంప్  కూతురు ఇవాంక హాజరైన విషయం తెలిసిందే.

trump
NBA India games
Howdy Modi
india
Visit
Invite
Mumbai

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు