రోల్ కోసం బన్నీ బరువు తగ్గాడు!

Submitted on 21 October 2019
Allu Arjun followed a Keto diet for Ala Vaikuntapuram Lo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’... గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ‘సామజవరగమన’ సాంగ్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బన్నీ వెయిట్ తగ్గాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

‘అల వైకుంఠపురములో’ క్యారెక్టర్ కోసం త్రివిక్రమ్ బరువు తగ్గాలని చెప్పడంతో బన్నీ క్విటో డైట్ ఫాలో అయ్యాడట.. క్వీటో జెనిక్ డైట్ అంటే తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం. ఈ డైట్ ఫాలో కావడంతో పాటు ప్ర‌తిరోజూ రెండు గంట‌ల పాటు వ్యాయామం చేయ‌డంతో బ‌న్నీ అనుకున్న బ‌రువు త‌గ్గి యంగ్ లుక్‌కి మారాడట. ఈ క్వీటో డైట్ వ‌ల్ల బ‌న్నీ ఏకంగా 14 కిలోల బ‌రువు త‌గ్గడం విశేషం..

పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్ కాగా.. టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘అల వైకుంఠపురములో’... రిలీజ్ కానుంది.  కెమెరా : పి.ఎస్. వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, సంగీతం : థమన్ ఎస్, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పిడివి ప్రసాద్.

Allu Arjun
Pooja Hegde
Thaman S
Trivikram

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు