హ్యాట్రిక్ కాంబినేషన్ : బన్నీ- త్రివిక్రమ్ కొత్త సినిమాకి పూజ

Submitted on 13 April 2019
Allu Arjun and Trivikram Srinivas' #AA19 puja ceremony held

అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. వీళ్లద్దరి కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చాయి. ఆ రెండూ కూడా సూపర్ డూపర్ హిట్స్. ఇప్పుడు ఇదే జోడీ.. మరో హిట్ కు వస్తోంది.
Read Also : ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం

ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పూజా కార్యక్రమాలు జరిగాయి. హారికహాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తీస్తున్నారు. ఈ వేడుకకు హీరోతోపాటు దర్శక, నిర్మాతలు, అల్లు అరవింద్ హాజరయ్యారు. హీరోయిన్ పూజా హెడ్డే. డీజే తర్వాత కలిసి నటిస్తున్నారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరగనుంది. త్రివిక్రమ్ తో తీసిన గత రెండు సినిమాలు క్రైం, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కాయి. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ ఉండనున్నట్లు సమాచారం. దసరా కానుకగా ధియేటర్లలో బన్నీ - త్రివిక్రమ్ మూవీ సందడి చేయబోతుంది. 
Read Also : స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా..KCR - జీవన్ రెడ్డి

Allu Arjun
Trivikram Srinivas
#AA19
puja ceremony

మరిన్ని వార్తలు