AA 20 ‘‘పుష్ప’’- పుష్పక్ నారాయణ్..

Submitted on 7 April 2020
Allu Arjun and Sukumar Movie Title ''Pushpa''?

‘అల వైకుంఠపురములో..’ మూవీతో భారీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.


ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రివీల్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. కట్ చేస్తే.. కాస్త ముందుగానే అప్ డేట్ లీక్ అయిపోయింది. బన్నీ బర్త్‌డే కానుకగా AA 20 టైటిల్ అనౌన్స్ చేయనున్నారట.

Read Also : మీ క్రియేటివిటీ తగలెయ్యా.. రోజా, శేఖర్ మాస్టర్లను వదలట్లేదుగా..

ఈ సినిమాకు ‘పుష్ప’ అనే పేరు ఫిక్స్ చేశారట. అర్జున్ క్యారెక్టర్ పేరు పుష్పక్ నారాయణ్ అని సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ బర్త్‌డే నాడు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడోనని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 

Allu Arjun
AA 20
Pushpa
Pushpak Narayan
Update
8th April
birthday
Sukumar
Mythri Movie Makers

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు