చైనా బాబా : జీవితంలో 669 ఫార్ములా చెప్పిన అలీబాబా జాక్ మా

Submitted on 14 May 2019
Alibaba Founder Jack Ma's '669'

అలీబాబా సంస్థ వ్యవస్థాపకుడు, చైనాలో అతిపెద్ద ధనవంతుడు అయిన జాక్ మా మరో కొత్త సూత్రం తెరపైకి తీసుకొచ్చారు. చైనాలో ఈ-కామర్స్ దిగ్గజం, ప్రపంచ వ్యాప్తంగా వెంచర్ క్యాప్టలిస్ట్ అయిన అలీబాబా జాక్ మా పనిలో ఉద్యోగులకు రోజుకో సూత్రం చెబుతూ వస్తున్నారు. మే 10వ తేదీన అలీబాబా మ్యారేజ్ డే సందర్భంగా.. కంపెనీలో పని చేసే ఉద్యోగులకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా 669 ఫార్ములాను తెరపైకి తెచ్చారు.

ఇంతకీ 669 అంటే ఏంటీ?
వారంలో ఆరు రోజులు.. ఆరు సార్లు శృంగారంలో పాల్గొనాలి అప్పుడో ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుందని వెల్లడించాడు. ఆరు రోజులు.. ఆరు సార్లు శృంగారాన్ని ఆశ్వాదిస్తూ ఆ సంఖ్యను 9 వరకు తీసుకెళ్లాలని కూడా ఉచిత సలహా పడేశారు. సామూహిక వివాహాల సందర్భంగా జాక్ మా వెల్లడించిన 669 ఫార్ములాపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం గతంలో తీసుకొచ్చిన 996 ఫార్ములా.

ఫార్ములా 996 అంటే?
కొన్నాళ్ల క్రితం అలీబాబా సంస్థలో కొత్త రూల్ తీసుకొచ్చారు ఆయన. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు రోజూ 12 గంటల చొప్పు.. వారంలో ఆరు రోజులు పని చేయాలి అంటే. దీనికి 996 ఫార్ములా అని పేరు పెట్టారు.

లేటెస్ట్ గా 669 ఫార్ములాతో దాన్ని పోల్చుతూ ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఆడుకుంటున్నారు జాక్ మాను. 996 ఫార్ములా పాటిస్తే.. ఆరు రోజులు.. ఆరు సార్లు శృంగారంలో పాల్గొనటానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది.. ఉన్నదంతా నీ ఆఫీసులోనే పీల్చేస్తున్నావ్ కదా అంటూ తిట్టిపోస్తున్నారు. 996 ఫార్ములాను అమలు చేస్తే.. 669 సూత్రం అస్సలు వర్కవుట్ కాదంటున్నారు. ఇలా కొత్త కొత్త ఫార్ములాలతో మభ్యపెట్టకుండా పని గంటలు తగ్గించాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
 

Alibaba
founder
Jack Ma's
'669'
Advice
Newlywed Employees

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు