‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో’..

Submitted on 22 October 2019
Ala Vaikunthapurramuloo - Ramuloo Ramulaa Song Teaser

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’... నుండి ‘రాములో రాములా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు.. ‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో.. ‘రాములో రాములా.. నా పాణం తీసిందిరో.. అనే సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది. 


థమన్ ట్యూన్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. భారీ సెట్‌లో పిక్చరైజ్ చేసిన ఈ పాటలో హీరోయిన్స్‌తో సహా సినిమాలోని ఇతర తారాగణమంతా కనిపించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తుంది. థమన్ మాస్ బీట్‌కి బన్నీ తన మార్క్ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం పక్కా అనిపిస్తోంది.


Read Also : థ్యాంక్స్ నయన్ - కత్రినా కైఫ్

పూర్తి సాంగ్ దీపావళి కానుకగా అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.
 

Allu Arjun
Pooja Hegde
Thaman S
Trivikram

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు