గ్రీన్ ఛాలెంజ్‌ స్వీకరించిన ఆటో డ్రైవర్.. ఫిదా అయిన అక్షయ్ కుమార్

Submitted on 18 September 2019
Akshay Kumar Impressed To Auto Wala

దేశమంతా గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ రాజకీయ, సినీ, క్రీడా, సామాన్య ప్రజలు అందరూ కలిసి  మొక్కలు నాటుతున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఆటో డ్రైవర్ త‌న ఆటో చుట్టూ మొక్క‌ల కుండీల‌ని పెట్టుకున్నాడు. ఇది అక్ష‌య్ కుమార్ కంట ప‌డ‌డంతో వెంట‌నే అక్షయ్ ఆటోను ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. 

అక్షయ్ మాట్లాడుతూ.. షూట్‌ కి వెళుతున్న స‌మ‌యంలో ఓ ఆటో చుట్టూ మొక్క‌ల‌ు అమర్చి ఉన్నాయి. అది చూసిన వెంటనే చాలా సంతోషించాను.  ప‌ర్యావ‌ర‌ణం కోసం అత‌ను చేసిన ప్ర‌య‌త్నం అద్భుతంగా ఉంది. అత‌నిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

ఇక రీసెంట్‌ గా మిష‌న్ మంగళ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అక్ష‌య్ ప్ర‌స్తుతం 'పృత్విరాజ్' సినిమాతో పాటు కాంచ‌న రీమేక్ (ల‌క్ష్మీ బాంబ్‌), హౌజ్‌ఫుల్ 4, సూర్య‌వంశీ సినిమాలు చేస్తున్నాడు.

Akshay Kumar
Impressed
Auto Wala

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు