‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్ - న్యూ పోస్టర్స్

Submitted on 21 October 2019
Ajay Devgn and Saif Ali Khan in Tanhaji: The Unsung Warrior

అజయ్ దేవ్‌గణ్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో.. ఓమ్ రౌత్ దర్శకత్వంలో, అజయ్ దేవ్‌గణ్ ఫిలింస్, టీ-సిరీస్ నిర్మిస్తున్న సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’.. 3డిలో భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో ఈ మూవీ రూపొందుతుంది.

ఈ సినిమా నుంచి రీసెంట్‌గా అజయ్ దేవ్‌గణ్, సైఫ్ అలీఖాన్‌ల న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.. అజయ్, సైఫ్ ఇద్దరివీ సెపరేట్ పోస్టర్స్‌తో పాటు ఇద్దరూ కలిసి ఉన్న లుక్ కూడా రిలీజ్ చేశారు.. మరాఠీ యోధుడు తానాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’.. 2020 జనవరి 10న విడుదల కానుంది.

Read Also : ‘సంగతమిళన్’ - నవంబర్ 15 విడుదల

జగపతిబాబు, శరద్ కేల్‌కర్, నేహాశర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : అజయ్ - అతుల్, ఎడిటింగ్ : ధర్మేంద్ర శర్మ, నిర్మాతలు : అజయ్ దేవ్‌గణ్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్.

Ajay Devgn
saif ali khan
Kajol
Ajay Devgn FFilms
T-Series
Om Raut

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు