జియోకు పోటీగా : ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

Submitted on 11 July 2019
Airtel to take on Reliance Jio with Rs 97 prepaid recharge plan, offers 2GB data for 14 days

డేటా సంచలనం.. రిలయన్స్ జియో టెలికం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. జియో రాకతో డేటా టారిఫ్ వార్ మొదలైంది. చౌకైన ధరకే డేటాను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. జియో దెబ్బకు ఇతర టెలికం పోటీదారుల్లో కలవరం మొదలైంది. జియో మాదిరిగా తమ యూజర్ల కోసం కొత్త కొత్త డేటా ఆఫర్లను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. జియో పోటీని తట్టుకుని నిలబడేందుకు టారిఫ్ వార్ ఫైట్ కొనసాగిస్తున్నాయి. 

ప్రముఖ టెలికం నెట్ వర్క్ దిగ్గజం భారతీ ఎయిర్ టెల్  కూడా జియోకు పోటీగా కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. రూ.97 రీఛార్జ్ ప్లాన్ తమ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ఇదివరకే జియో కూడా తమ యూజర్ల కోసం రూ.97 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది.

జియోతో పాటు ఎయిర్ టెల్ కూడా మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు ప్లాన్లను రీవైజ్ చేస్తూ ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఎయిర్ టెల్ అందిస్తోన్న ఈ కొత్త ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫెట్స్, రోజుకు 100 SMSలు, 2GB డేటా పొందవచ్చు.

భారతీ ఎయిర్ టెల్ అందించే రూ.97 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS), కర్నాటక సర్కిళ్లలో అందుబాటులో ఉంది. 2018 ఏడాదిలో కూడా ఎయిర్ టెల్ ఇదే రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద 1.5GB డేటాతో పాటు 350 నిమిషాల వాయిస్ కాలింగ్ అందించింది.

ప్రస్తుత ప్లాన్.. రూ.97 ప్లాన్ అప్ గ్రేడ్ తో ‘స్పెషల్ రీఛార్జ్ STV కొంబో’ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఆఫర్ కింద.. 2GB డేటా, అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడెటీ 14 రోజుల కాల పరిమితి మాత్రమే ఉంటుంది. 

Airtel
reliance jio
prepaid recharge plan
2GB data for 14 days


మరిన్ని వార్తలు