కూతుళ్ల ద్వారా కరోనా - ఆసుపత్రిలో షారుఖ్ ఖాన్ స్నేహితుడు..

Submitted on 8 April 2020
After daughters, now producer Karim Morani tests positive for Covid-19

కరోనా మహమ్మారి ప్రజలను రోజురోజుకీ కలవరపెడుతోంది. బాలీవుడ్ సింగ‌ర్ క‌నికాక‌పూర్ అయిదుసార్లు పాజిటివ్ వచ్చిన తర్వాత క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. మరోనటి అంకితా లోఖండే నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో అపార్ట్‌మెంట్‌కి ‌సీల్ వేశారు. నిర్మాత కరీం మొరానీ కూతురుకు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానికి నిర్వహించిన పరీక్షలలో ఆయనకు కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన్ని ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


హీరో షారుఖ్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్.. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘రావ‌న్’, ‘దిల్ వాలే’ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత క‌రీం మొరానీ కూతురు షాజా జ‌రానీను ఇటీవల అస్వ‌స్థ‌త‌గా ఉంద‌ని ఆసుప‌త్రికి వెళ్ల‌గా అక్క‌డ ఆమెకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. శ్రీలంక నుంచి మార్చి మొదటివారంలో భారత్‌కు తిరిగి వచ్చిన షాజాకు తొలుత ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోయినా.. ఆమెను నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమెకు పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Read Also : సావిత్రమ్మ ‘సామజవరగమన’ చూశారా!..

రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన మరో కూతురు జోవాకు పరీక్షల్లో కరోనా సోకినట్లు స్పష్టమైంది. దీంతో ఆమెకు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. రెండు రోజులు తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించగా.. ఆమె రిపోర్ట్‌లో ఫలితం నెగెటివ్‌ అని వచ్చింది. దీంతో ఆమెను నానావతి ఆస్పత్రికి తరలించి.. ఆమె సోదరితో కలిసి ఐసోలేషన్‌లో ఉంచారని మొరాని గతంలో తెలిపారు. అయితే తన కుమార్తెలతో చాలా దగ్గరగా ఉన్న కారణంగానే మొరానికి కూడా ఈ వ్యాధి సోకిందని కరీం సోదరుడు మీడియాకు తెలిపారు. 

 
 

coronavirus
Covid-19
Karim Morani
Shaza Morani
Zoa Morani
Tests
POSITIVE
Producer
Bollywood

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు