ఆ నిర్మాత ‘టాప్ తీసెయ్.. నేను చూడాలి’ అన్నాడు..

actress-malhaar-rathod-share-her-casting-couch-expierence

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు వర్కౌట్స్, కుకింగ్, క్లీనింగ్ వంటి రోజు వారీ పనులకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ టీవీ నటి మల్హార్ రాథోడ్ గతంలో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మీ టూ’.. ‘కాస్టింగ్ కౌచ్’.. హాలీవుడ్‌లో మొదలై బాలీవుడ్‌తో సహా పలు ఇండస్ట్రీలను కుదిపేసింది. ఈ ఉదంతంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.మల్హార్ రాథోడ్ కూడా గతంలో తానెదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఉదంతం గురించి మాట్లాడింది. 

‘‘దాదాపు 8 సంవత్సరాల క్రితం ఓ నిర్మాత  తన సీరియల్‌లో అవకాశం ఇస్తానని చెప్పి ఆడిషన్ కోసం రమ్మన్నాడు. అతని వయసు 65 ఏళ్లు. ఆడిషన్ కోసమని అతని రూమ్‌లోకి వెళితే.. ‘టాప్ తీసెయ్.. నేను చూడాలి’ అన్నాడు. నేను షాకయ్యాను. కొంతసేపటికి ‘ఏం కాదు తీసేయ్.. ఇక్కడ ఇంకెవరు లేరు.. చూసేది నేను మాత్రమే’ అంటూ టాప్ తీయమని బలవంతం చేశాడు. కంగారుగా అక్కణ్నుంచి వెంటనే బయటకు వచ్చేశాను’’అని మల్హార్ తెలిపింది. టీవీ రంగంలో కూడా చాలా మంది లైంగిక వేధింపులకు పాల్పడతారని, లొంగకపోతే కెరీర్‌పై దెబ్బకొడతారని, అలాంటి సంఘటనలు చాలా తాను చూశానని కూడా మల్హార్ తెలిపింది.

మరిన్ని తాజా వార్తలు