రేపిస్టులు ఎలా ఉంటారో ఫస్ట్ టైమ్ చూశా : సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తే బూతులు తిట్టాడు

Submitted on 2 December 2019
actress madhavi latha fires on netizen

వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో టీజింగే హీరోయిజమా? పేరుతో 10టీవీ నిర్వహించిన స్పెషల్ డిస్కషన్ లో నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ వ్యవహారంలో సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ని నిలదీసినందుకు.. ఓ నెటిజన్ నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ఆ నెటిజన్ చేసిన కామెంట్ తనను చాలా బాధించిందన్నారు. రేపిస్టులు ఎలా ఉంటారో ఫస్ట్ టైమ్ కళ్లారా చూశాను అని కామెంట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. దిశ ఘటనలో సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తూ తాను ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాను అని మాధవీలత చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే.. మీరు ఎందుకు స్పందించడం లేదు. నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదు. ఇంకా ఎన్నాళ్లు టైమ్ తీసుకుంటారు, పట్టుకున్నా శిక్షలు వేయరా. మీ ఇంటి ఆడపిల్లకు ఇలా జరిగితేనే రెస్పాండ్ అవుతారా. బయటివాళ్లు మీకు ఆడపిల్లలా కనిపించడం లేదా? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అని ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాను అని మాధవీలత వివరించారు. దీనికి చాలామంది కామెంట్లు చేశారని చెప్పారు. 

ఒకడు మాత్రం చాలా దారుణంగా కామెంట్ పెట్టాడని వాపోయారు. ''ఏందే నీ గోల. నీ లాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు'' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడని మాధవీలత వెల్లడించారు. దానికి తాను చాలా ఘాటుగానే బదులు ఇచ్చాను అన్నారు. '' రేపిస్టులు అంటే అలానో ఇలానో ఉంటారు అని టీవీలో చూశాను, పేపరల్లో చదివాను.. కానీ రేపిస్టులు అంటే నీలా ఉంటారు అని ఫస్ట్ టైమ్ నా ఫేస్ బుక్ లో చూశాను.. నీ సంస్కారం ఏంటో, నీ తల్లిదండ్రలు నిన్ను ఎంత గొప్పగా పెంచారో.. నీ కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది'' అని ఆ వ్యక్తికి రిప్లయ్ ఇచ్చాను అని మాధవీలత చెప్పారు. అసలు తాను పెట్టిన పోస్టు ఏంటి.. ఆ నెటిజన్ చేసిన కామెంట్ ఏంటి? అని మాధవీ లత అన్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగానే ఆడవారికి రక్షణ లేకుండా పోయిందన్నారు.

RAPISTS
Netizen
Actress
Madhavi Latha
10tv
disha
Rape
murder
CM KCR
Telangana

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు