రాజీకొస్తే రేటు పెంచుతానన్నాడు..

Submitted on 9 April 2020
Actress Maanvi Gagroo Opens Up About Casting Couch

మీటూ.. సినిమా పరిశ్రమను కుదిపేసింది.. హాలీవుడ్‌తో మొదలై పలు భారతీయ పరిశ్రమలను కుదిపేసిందీ ఉదంతం.. తాజాగా బాలీవుడ్ నటి మాన్వీ గాగ్రో క్యాస్టింగ్ కౌచ్ వివాదం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం చిత్రపరిశ్రమలో చర్చకు దారితీసింది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం దర్శక నిర్మాతలతో తనను అడ్జెస్ట్ అవమని ఉచిత సలహా ఇచ్చారంటూ ఆమె ఆరోపించింది. తాజాగా ఓ ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తన కెదురైన అనుభవాలను ఆమె చెప్పుకొచ్చింది.

‘ధూమ్‌ మచావో ధూమ్‌’ టెలివిజన్‌ షోతో కెరీర్‌ ప్రారంభించిన మాన్వీ.. ‘ట్రిప్లింగ్‌’, ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’ వంటి వెబ్‌ సిరీస్‌లో నటించింది. హిందీ సినిమాలతోపాటు సీరియల్స్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌లో వర్క్ చేయానికి నిర్మాత నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఆ సమయంలో నిర్మాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని నుంచి లైంగిక వేధింపులు ఎదర్కొన్నానని తెలిపింది మాన్వీ.

Read Also : మద్యం దొరక్క నిద్రమాత్రలు మింగిన మనోరమ కొడుకు

‘‘వెబ్ సిరీస్‌లో నటించాలని ఓ నిర్మాత కాల్ చేసాడు. మీ బడ్జెట్ ఎంత అని అడిగాడు. ముందు కథ చెప్పండి. నాకు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడదామన్నాను. నేను చెప్పేది వినకుండా ఇంత ఇస్తా అని ఒక అమౌంట్ చెప్పాడు. అది చాలా తక్కువ అని చెప్పా.. వెంటనే త్రీ టైమ్స్ ఎక్కవ చేసి చెప్పాడు. నీకు కావాలంటే చెప్పు, ఇంతకన్నా ఎక్కువ ఇస్తా.. కానీ, కాంప్రమైజ్ కావాలి.. అనడంతో షాక్ అయ్యాను.. కోపంతో తిట్టేసాను.. పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పడంతో కాల్ కట్ చేసాడు..’’ అని చెప్పుకొచ్చింది మాన్వీ. దీంతో ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరై ఉంటరబ్బా అని ఆరాలు తీస్తున్నారు బాలీవుడ్ బాబులు.  

 

Maanvi Gagroo
Actress
casting couch
Producer
Bollywood

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు