బీజేపీలో చేరిన సన్నీ డియోల్

Submitted on 23 April 2019
Actor Sunny Deol  join Bharatiya Janata Party

బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ ఇవాళ(ఏప్రిల్-23,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్ ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయిని తన తండ్రి సపోర్ట్ చేసిన విధంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తాను మద్దతు తెలపనున్నట్లు సన్నీ డియోల్ తెలిపారు. ఇకపై తన పనే మాట్లాడుతుందన్నారు.

బీజేపీలో చేరిక విషయమై పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో గత శుక్రవారం పూణే ఎయిర్ పోర్ట్ లాంజ్ లో సన్నీడియోల్ సమావేశమైన విషయం తెలిసిందే. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి సన్నీడియోల్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గురుదాస్ పూర్ బీజేపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం.

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ వినోద్ ఖన్నా గురుదాస్ దాస్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా 1997,1999,2004,2014 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో క్యాన్సర్ వ్యాధితో వినోద్ ఖన్నా మరణించారు.ఈ సీటు నుంచి ఇప్పుడు సన్ని డియోల్ ను బీజేపీ రంగంలోకి దించుతోంది. గదర్,ఏక్ ప్రేమ్ కథ,దామిని,గయాల్,బోర్డర్ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా సన్ని డియోల్ మంచి పాపులారిటీ సంపాదించాడు

sunny deol
BJP
join
amith shah
Punjab
loksabha elections
gurudaspur
Contest
vinid khanna

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు