క్లాప్ సినిమా ప్రారంభం

Submitted on 12 June 2019
Aadhi's CLAP Movie Launched

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'క్లాప్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తెలుగు, తమిళ్ భాషల్లో బిగ్ ప్రింట్ పిక్చర్స్ నిర్మించనుంది.. పృథ్వీ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. 

తెలుగు వెర్షన్‌కు మ్యాస్ట్రో ఇళయరాజా, తమిళ్ వెర్షన్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత అల్లు అరదవింద్ కెమెరా స్విచ్చాన్ చేసారు. దర్శకులు బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, గోపిచంద్ మలినేని దర్శకుడికి స్ర్కిప్ట్ అందచేసారు.

ఆది తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆది ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 

Aadi Pinisetty
Aakanksha Singh
Ilaiyaraja
Bigprint Pictures
Prithivi Adithya

మరిన్ని వార్తలు